Telugu Global
NEWS

అమరావతి బినామీల కోసమే విశాఖ, కర్నూలును బాబు వ్యతిరేకిస్తున్నారు....

చంద్రబాబు కన్నింగ్ పాలిటిక్స్‌కు పూర్తిగా అలవాటు పడిపోయారన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం పది మంది మాత్రమే అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో చంద్రబాబు ఆలోచన చేసుకుంటే మంచిదన్నారు. ముందుగా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ధైర్యం నింపి అప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడితే మంచిదన్నారు. జగన్‌ను అన్ని ప్రాంతాల వారు సొంత మనిషిగా చూస్తున్నారని… అందుకే కడపలో 10 సీట్లు వస్తే విజయనగరం జిల్లాలోనూ 9కి 9 స్థానాల్లో వైసీపీని గెలిపించారన్నారు. విశాఖలో పరిపాలన […]

అమరావతి బినామీల కోసమే విశాఖ, కర్నూలును బాబు వ్యతిరేకిస్తున్నారు....
X

చంద్రబాబు కన్నింగ్ పాలిటిక్స్‌కు పూర్తిగా అలవాటు పడిపోయారన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం పది మంది మాత్రమే అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో చంద్రబాబు ఆలోచన చేసుకుంటే మంచిదన్నారు. ముందుగా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ధైర్యం నింపి అప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడితే మంచిదన్నారు. జగన్‌ను అన్ని ప్రాంతాల వారు సొంత మనిషిగా చూస్తున్నారని… అందుకే కడపలో 10 సీట్లు వస్తే విజయనగరం జిల్లాలోనూ 9కి 9 స్థానాల్లో వైసీపీని గెలిపించారన్నారు.

విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాలు బాగుపడుతాయన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు డిమాండ్‌ ఎంతోకాలంగా ఉందని.. కానీ ఏ ముఖ్యమంత్రి ఆ పని చేయలేకపోయారన్నారు. ఇప్పుడు జగన్‌ దాన్ని నెరవేరుస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.

రాష్ట్ర ప్రజల పట్ల చంద్రబాబుకు ప్రేమ లేదని… అమరావతిలో భూములు కొన్న బినామీలు నష్టపోతానే ఇలా విశాఖను పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టును వ్యతిరేకిస్తున్నారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. శ్రీకాకుళం ప్రజలంటే ఇష్టమని చెప్పిన పవన్ కల్యాణ్‌కు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు.

23 సంస్థలు రాష్ట్రానికి కేటాయిస్తే ఒక్కటి కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు ఏర్పాటు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన జిల్లాలని… వీటితో పాటు ఇతర జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌ విశాఖలో ఉంటారా, విజయవాడలో ఉంటారా అన్నది త్వరలోనే చూస్తారని అందుకు తొందరెందుకని చంద్రబాబును అవంతి ప్రశ్నించారు.

చంద్రబాబు మాయలో పవన్ కల్యాణ్ పడి ప్రజల మధ్య కులం పేరుతో, మతం పేరుతో చిచ్చు పెట్టవద్దని కోరారు. ఒక ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి జరిగి… ఆ ప్రాంతం ఆధిపత్యం పెరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నారు. ఆ ఇబ్బందిని హైదరాబాద్ విషయంలో చూశామన్నారు. కాబట్టి మరోసారి ఏపీలో అలాంటి పరిస్థితి రాకుండా అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచాల్సిన అవసరం ఉందన్నారు.

First Published:  18 Dec 2019 5:18 AM GMT
Next Story