Telugu Global
NEWS

చంద్రబాబును 16 ఏళ్లు జైల్లో పెడుతాం

జగన్‌మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారని… చంద్రబాబును 16 ఏళ్లు జైల్లో పెడుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన అవినీతి మొత్తం వెలికితీస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు పనిగట్టుకుని తన కుటుంబంపై ఆరోపణలు చేశారని విమర్శించారు. జిల్లాలో తనను అణగదొక్కాలని తొలి నుంచి చంద్రబాబు కంకణం కట్టుకుని పనిచేశారన్నారు. కానీ అది చంద్రబాబు వల్ల సాధ్యమయ్యే పనికాదన్నారు. చంద్రబాబు సీఎంగా చేసిన మూడు సార్లు రాష్ట్రంలో వర్షాలు లేక ప్రజలు, […]

చంద్రబాబును 16 ఏళ్లు జైల్లో పెడుతాం
X

జగన్‌మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారని… చంద్రబాబును 16 ఏళ్లు జైల్లో పెడుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన అవినీతి మొత్తం వెలికితీస్తున్నామని చెప్పారు.

చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు పనిగట్టుకుని తన కుటుంబంపై ఆరోపణలు చేశారని విమర్శించారు. జిల్లాలో తనను అణగదొక్కాలని తొలి నుంచి చంద్రబాబు కంకణం కట్టుకుని పనిచేశారన్నారు. కానీ అది చంద్రబాబు వల్ల సాధ్యమయ్యే పనికాదన్నారు.

చంద్రబాబు సీఎంగా చేసిన మూడు సార్లు రాష్ట్రంలో వర్షాలు లేక ప్రజలు, రైతులు ఇబ్బందిపడ్డారన్నారు. కానీ ఇటీవల భారీ వర్షాలు పడడం వల్లే నదుల్లో ప్రవాహం పెరిగి ఇసుక కొరత ఏర్పడిందన్నారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని విమర్శించారు.

వరద కారణంగా కొత్తగా 10 కోట్ల టన్నుల ఇసుక నదుల్లో ఉందన్నారు. టీడీపీ చీరలో పవన్ కల్యాణ్ ఒక పేలిక మాత్రమేనని పెద్దిరెడ్డి విమర్శించారు.

First Published:  9 Nov 2019 9:42 PM GMT
Next Story