Telugu Global
NEWS

గరికపాటి సూచనను జగన్‌ ఫాలో అయ్యారా?

ఇటీవల గోదావరి నదిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి భారీగా ప్రాణనష్టం జరిగింది. బోటును బయటకు తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక బోటు బయటకు రాదేమో అనుకుంటున్న సమయంలో బోటు వెలికితీతకు ధర్మాడి సత్యం ముందుకొచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం బోటు వెలికితీత పనిని 22 లక్షల రూపాయాలకు ధర్మాడి సత్యం బృందానికి అప్పగించింది. అనేక సవాళ్లను అధిగమించి బోటును ధర్మాడి బృందం బయటకు తీసింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే 22 లక్షలను […]

గరికపాటి సూచనను జగన్‌ ఫాలో అయ్యారా?
X

ఇటీవల గోదావరి నదిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి భారీగా ప్రాణనష్టం జరిగింది. బోటును బయటకు తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక బోటు బయటకు రాదేమో అనుకుంటున్న సమయంలో బోటు వెలికితీతకు ధర్మాడి సత్యం ముందుకొచ్చారు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం బోటు వెలికితీత పనిని 22 లక్షల రూపాయాలకు ధర్మాడి సత్యం బృందానికి అప్పగించింది. అనేక సవాళ్లను అధిగమించి బోటును ధర్మాడి బృందం బయటకు తీసింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే 22 లక్షలను ధర్మాడి బృందానికి ఇచ్చింది. అయితే ఎంతో సాహసోపేతంగా పనిచేసి బోటును బయటకు తీయడంతో కృషి చేసిన ధర్మాడి బృందానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి … వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించారు.

ధర్మాడి సత్యంకు అవార్డు ఇవ్వాలన్న ఆలోచన ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు సలహా మేరకే జరిగినట్టు చెబుతున్నారు. ఉదయం ఒక టీవీ చానల్‌లో తన ప్రవచనాలు చెబుతూ మధ్యలో గోదావరిలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఈ బోటును వెలికితీయడంలో అసాధారణ పనితీరు కనబరిచిన ధర్మాడి సత్యాన్ని అభినందించారు.

ప్రభుత్వాలు కూడా ఇచ్చే అవార్డులు, స్థలాలు, ఇల్లులు వంటి ఏవైనా ఉంటే క్రీడాకారులకే కాకుండా అసలైన ధైర్యసాహసాలు చూపిన ధర్మాడి సత్యం లాంటి వారికి ఇవ్వాలని సూచించారు.

గరికిపాటి చేసిన ఈ సూచనను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి దృష్టికి ఆయన వద్ద ఉండే వ్యక్తులు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. మంచి సలహా కావడంతో ముఖ్యమంత్రి కూడా అంగీకరించి అవార్డును ప్రకటించారు.

First Published:  31 Oct 2019 9:24 AM GMT
Next Story