Telugu Global
Cinema & Entertainment

నాగార్జున, నాగచైతన్య.... ఇప్పుడు సమంత కూడా !

ఆన్ స్క్రీన్ లో నైనా ఆఫ్ స్క్రీన్ లో అయినా టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగ చైతన్య మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించక మానదు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘ఏ మాయ చేసావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ మరియు ఈ మధ్యనే ‘మజిలీ’ వంటి సినిమాలలో కలిసి నటించి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య ‘వెంకీ మామ’ […]

నాగార్జున, నాగచైతన్య.... ఇప్పుడు సమంత కూడా !
X

ఆన్ స్క్రీన్ లో నైనా ఆఫ్ స్క్రీన్ లో అయినా టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగ చైతన్య మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించక మానదు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘ఏ మాయ చేసావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ మరియు ఈ మధ్యనే ‘మజిలీ’ వంటి సినిమాలలో కలిసి నటించి మంచి విజయాలను అందుకున్నారు.

తాజాగా ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగచైతన్య మరియు నాగార్జున కలిసి ‘బంగార్రాజు’ అనే ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు.

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ కి ప్రీక్వల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో నాగార్జున మరియు నాగ చైతన్య తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున పక్కన రమ్యకృష్ణ మళ్లీ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఒకవేళ నిజంగానే సమంతా ఇందులో నటిస్తే ఇది చై, సామ్ కాంబినేషన్ లో వచ్చే 5వ సినిమా అవుతుంది.

First Published:  24 Sep 2019 5:24 AM GMT
Next Story