Telugu Global
Cinema & Entertainment

సాహో ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలివే

అటుఇటుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది సాహో సినిమా. అయితే ఈ సినిమాను మాత్రం జస్ట్ 319 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్మారు. మిగిలిన మొత్తాన్ని శాటిలైట్, డిజిటల్, ఆడియో రూపంలో రికవరీ చేసుకుంటారు. ఇదిలా ఉండగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 330 కోట్ల రూపాయలు రావాలి. అప్పుడే ఖర్చులు పోనూ డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఒడ్డున పడతారు. ఏమాత్రం తేడాకొట్టినా పదుల కోట్లలో నష్టం గ్యారెంటీ. అయితే బయట డిస్ట్రిబ్యూటర్ల […]

సాహో ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలివే
X

అటుఇటుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది సాహో సినిమా. అయితే ఈ సినిమాను మాత్రం జస్ట్ 319 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్మారు. మిగిలిన మొత్తాన్ని శాటిలైట్, డిజిటల్, ఆడియో రూపంలో రికవరీ చేసుకుంటారు. ఇదిలా ఉండగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 330 కోట్ల రూపాయలు రావాలి. అప్పుడే ఖర్చులు పోనూ డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఒడ్డున పడతారు. ఏమాత్రం తేడాకొట్టినా పదుల కోట్లలో నష్టం గ్యారెంటీ.

అయితే బయట డిస్ట్రిబ్యూటర్ల కంటే యూవీ క్రియేషన్స్ నిర్మాతలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమాను వీళ్లు చాలా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. చివరికి భారీ మార్కెట్ కలిగిన నైజాంలో కూడా సొంత రిలీజ్ కు వెళ్తున్నారంటే యూవీ నిర్మాతల ధైర్యాన్ని అర్థంచేసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు చూద్దాం

నైజాం – రూ. 40 కోట్లు (యూవీ సొంత రిలీజ్)
సీడెడ్ – రూ. 25 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 16 కోట్లు
ఈస్ట్ – రూ. 11 కోట్లు
వెస్ట్ – రూ. 8.5 కోట్లు
కృష్ణా – రూ. 8.5 కోట్లు (యూవీ సొంత రిలీజ్)
గుంటూరు – రూ. 11.50 కోట్లు (యూవీ సొంత రిలీజ్)
నెల్లూరు – రూ. 4.50 కోట్లు (యూవీ సొంత రిలీజ్)

First Published:  26 Aug 2019 10:57 AM GMT
Next Story