Telugu Global
Cinema & Entertainment

తాప్సి సినిమా రీమేక్ లో... బాలకృష్ణ ?

తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘నెరకొండ పర్వై’ అనే తమిళ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘పింక్’ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అజిత్ కీలక పాత్ర పోషించాడు. సినిమా కథ విపరీతంగా నచ్చేయడం… పైగా ఆ కథకి యూనివర్సల్ అప్పీల్ ఉందని…. తెలుగులో ఒక స్టార్ హీరో తో ఈ సినిమాని రీమేక్ చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడట. తాజా […]

తాప్సి సినిమా రీమేక్ లో... బాలకృష్ణ ?
X

తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘నెరకొండ పర్వై’ అనే తమిళ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘పింక్’ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అజిత్ కీలక పాత్ర పోషించాడు. సినిమా కథ విపరీతంగా నచ్చేయడం… పైగా ఆ కథకి యూనివర్సల్ అప్పీల్ ఉందని…. తెలుగులో ఒక స్టార్ హీరో తో ఈ సినిమాని రీమేక్ చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు దిల్ రాజు… బాలకృష్ణ పేరు అనుకుంటున్నాడని తెలుస్తోంది.

హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్ర బాలకృష్ణ పోషిస్తే బాగుంటుందని దిల్ రాజు బాలకృష్ణను సంప్రదించాలని అనుకుంటున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే దిల్ రాజు-బోనీకపూర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణ ఒప్పుకుంటే దిల్ రాజు త్వరలోనే ‘పింక్’ సినిమా స్క్రీనింగ్ వేయనున్నాడు. సోషల్ డ్రామా గా విడుదలైన ఈ సినిమాని బాలకృష్ణ చూసి తెలుగు రీమేక్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట.

First Published:  4 Aug 2019 11:06 PM GMT
Next Story