Telugu Global
Cinema & Entertainment

మనవరాలితో డైలాగ్ లు కాదు.... పద్యం పాడిస్తున్నాడు

తెలుగు అనర్గళంగా మాట్లాడడం మాత్రమే కాకుండా తెలుగు పదాలను స్వచ్ఛంగా ఉచ్చరించ గల హీరోలలో మోహన్ బాబు ఒకరు. నటన పరంగా మాత్రమే కాక మోహన్ బాబు డైలాగ్ డెలివరీ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ లో పేరుప్రఖ్యాతులు గాంచిన మోహన్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన కూతురు మంచు లక్ష్మి ఒక వీడియో ని షేర్ చేసింది. ఆ వీడియో […]

మనవరాలితో డైలాగ్ లు కాదు.... పద్యం పాడిస్తున్నాడు
X

తెలుగు అనర్గళంగా మాట్లాడడం మాత్రమే కాకుండా తెలుగు పదాలను స్వచ్ఛంగా ఉచ్చరించ గల హీరోలలో మోహన్ బాబు ఒకరు. నటన పరంగా మాత్రమే కాక మోహన్ బాబు డైలాగ్ డెలివరీ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.

కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ లో పేరుప్రఖ్యాతులు గాంచిన మోహన్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన కూతురు మంచు లక్ష్మి ఒక వీడియో ని షేర్ చేసింది. ఆ వీడియో లో మోహన్ బాబు తన మనవరాలికి ‘ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు’ పద్యం నేర్పిస్తూ కనిపిస్తారు.

నిర్వాణ కూడా మోహన్ బాబుతో పాటు ఆ పద్యాన్ని స్పష్టంగా పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ వీడియోని పోస్ట్ చేస్తూ “నాన్నగారు నివి కి డైలాగులు నేర్పిస్తున్నారు. వాళ్ళిద్దరి బంధం చాలా అద్భుతమైనది. వీళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

వీడియో చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లలో కొందరు… మోహన్ బాబు చెబుతున్నది డైలాగులు కాదని పద్యమని మంచు లక్ష్మికి చెబుతున్నారు.

ఇక సినిమాల పరంగా చూస్తే గతేడాది ‘వైఫ్ ఆఫ్ రామ్’ అనే సినిమాలో కనిపించిన మంచు లక్ష్మి ‘మిస్సెస్ సుబ్బలక్ష్మి’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

First Published:  5 Aug 2019 12:04 AM GMT
Next Story