Telugu Global
Cinema & Entertainment

లొకేషన్ల వేటలో... శంకర్ బృందం

బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు’ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘భారతీయుడు 2’ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటిదాకా ఈ సినిమా షూటింగ్ బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది అని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతుందట. ఆగస్టు రెండు లేదా మూడో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో […]

లొకేషన్ల వేటలో... శంకర్ బృందం
X

బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు’ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘భారతీయుడు 2’ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే మొన్నటిదాకా ఈ సినిమా షూటింగ్ బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది అని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతుందట. ఆగస్టు రెండు లేదా మూడో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, రకుల్ ప్రీత్, ప్రియా భవాని శంకర్, విద్యుత్ ఝంవాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కొన్ని అద్భుతమైన లొకేషన్లను వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

కర్నూల్ మరియు రాయలసీమ లో జరగబోయే మేజర్ షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో పడ్డారు రవి వర్మన్.

ఇక ఈ సినిమా షూటింగ్ ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి ‘భారతీయుడు 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

First Published:  31 July 2019 4:00 AM GMT
Next Story