Telugu Global
Cinema & Entertainment

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో... నమిత

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘జై సింహ’ ఫేమ్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బాలకృష్ణ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే సెట్స్ కి వెళ్ళగా చిత్రబృందం ప్రస్తుతం బ్యాంకాక్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘లెజెండ్’, ‘పండగ చేసుకో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాలలో కనిపించిన సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సుమంత్ హీరోగా నటించిన ‘దగ్గరగా […]

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో... నమిత
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘జై సింహ’ ఫేమ్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బాలకృష్ణ చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే సెట్స్ కి వెళ్ళగా చిత్రబృందం ప్రస్తుతం బ్యాంకాక్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘లెజెండ్’, ‘పండగ చేసుకో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాలలో కనిపించిన సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సుమంత్ హీరోగా నటించిన ‘దగ్గరగా దూరంగా’ ఫేమ్ వేదిక కూడా ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ తో రొమాన్స్ చేసిన ఒక హాట్ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బాలయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు నమిత.

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ సినిమాలో ఈమె పాత్రకి నెగిటివ్ షేడ్స్ ఉంటాయి అని వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  28 July 2019 2:24 AM GMT
Next Story