Telugu Global
NEWS

బీజేపీ భ‌యం.... గ్రేట‌ర్‌లో టీఆర్ఎస్ కొత్త ప్లాన్ !

తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగాయి. టీఆర్ఎస్ బంప‌ర్ మెజార్టీ కొట్టింది. 88 ఎమ్మెల్యే సీట్లు కొల్లగొట్టింది. ముంద‌స్తు ఎన్నిక‌లు అచ్చిరావడంతో ఇప్పుడు అదే ఫార్ములా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అమ‌లు చేయాల‌ని చూస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు జ‌రిగి నాలుగేళ్ల‌యింది. ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది టైమ్ ఉంది. వీలుంటే మ‌రో ఆరు నెల‌లు ముందుకు తీసుకుపోవ‌చ్చు. కానీ ఈ ఏడాది చివ‌ర్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ కు ఎన్నిక‌లు జ‌రిపితే ఎలా ఉంటుంద‌ని టీఆర్ఎస్ హైక‌మాండ్ ఆలోచిస్తుంద‌ట‌. దీపం […]

బీజేపీ భ‌యం.... గ్రేట‌ర్‌లో టీఆర్ఎస్ కొత్త ప్లాన్ !
X

తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగాయి. టీఆర్ఎస్ బంప‌ర్ మెజార్టీ కొట్టింది. 88 ఎమ్మెల్యే సీట్లు కొల్లగొట్టింది. ముంద‌స్తు ఎన్నిక‌లు అచ్చిరావడంతో ఇప్పుడు అదే ఫార్ములా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అమ‌లు చేయాల‌ని చూస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు జ‌రిగి నాలుగేళ్ల‌యింది. ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది టైమ్ ఉంది. వీలుంటే మ‌రో ఆరు నెల‌లు ముందుకు తీసుకుపోవ‌చ్చు. కానీ ఈ ఏడాది చివ‌ర్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ కు ఎన్నిక‌లు జ‌రిపితే ఎలా ఉంటుంద‌ని టీఆర్ఎస్ హైక‌మాండ్ ఆలోచిస్తుంద‌ట‌.

దీపం ఉండగానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి. ఇదీ పాత సామెత‌. ప్ర‌జ‌ల్లో పాజిటివ్ మూడ్ ఉండ‌గానే ఓట్లు రాబ‌ట్టుకోవాలి. ఇది టీఆర్ఎస్ ఎన్నిక‌ల తంత్రం.

ప్ర‌స్తుతం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో టీఆర్ఎస్ కు ఢోకా లేదు. గ‌త ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్లు గెలిచారు. బీజేపీ ఒకే ఒక సీటు మాత్రమే గెలిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా జీహెచ్ ఎంసీ ని కైవ‌సం చేసుకోవాలంటే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీఆర్ఎస్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

తెలంగాణ‌లో పాగాకు బీజేపీ ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. గ్రేట‌ర్‌లోని లోక్‌స‌భ సీట్ల‌లో మొన్న సికింద్రాబాద్ సీటును బీజేపీ గెలిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా గ్రేట‌ర్‌లో పాగా కోసం ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తుంది. ఇప్ప‌టికే కొన్ని డివిజ‌న్ల‌పై దృష్టిపెట్టింది.

బీజేపీ కొంచెం ప‌ట్టు సాధించేలోపే గ్రేట‌ర్ బ‌రిలో ముందుకు వెళితే మంచిద‌ని టీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌. ప్ర‌తిప‌క్షాలు స‌ర్దుకోక‌ముందే ఎన్నిక‌లు పెడితే చావు దెబ్బ‌కొట్ట‌వ‌చ్చ‌ని కేసీఆర్ ఆలోచ‌న‌.

ఇప్ప‌టికే గ్రేట‌ర్‌పై స‌ర్వేలు చేయిస్తున్న కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం క‌న్పిస్తోంది.

First Published:  25 July 2019 8:48 PM GMT
Next Story