Telugu Global
Cinema & Entertainment

రాఘవ లారెన్స్.... మరొక హారర్ థ్రిల్లర్

హారర్ కామెడీ అయిన ‘ముని’ సిరీస్ లో నాలుగవ భాగం… ‘కాంచన’ సిరీస్ లో మూడవ భాగం అయిన ‘కాంచన 3’ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. రాఘవ లారెన్స్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం రాఘవ లారెన్స్ ఈసారి ఒక హారర్ థ్రిల్లర్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫాంటసీ హారర్ […]

రాఘవ లారెన్స్.... మరొక హారర్ థ్రిల్లర్
X

హారర్ కామెడీ అయిన ‘ముని’ సిరీస్ లో నాలుగవ భాగం… ‘కాంచన’ సిరీస్ లో మూడవ భాగం అయిన ‘కాంచన 3’ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

రాఘవ లారెన్స్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం రాఘవ లారెన్స్ ఈసారి ఒక హారర్ థ్రిల్లర్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.

లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాక…. సినిమాలో హీరోగా కూడా నటించబోతున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని తెలుస్తోంది. హారర్ సినిమాలతో…. ఇప్పటికే బోలెడంత అనుభవం ఉండటంతో సన్ పిక్చర్స్ ఏరికోరి లారెన్స్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘లక్ష్మీబాంబ్’ సినిమాతో బిజీగా ఉన్న రాఘవ లారెన్స్ త్వరలోనే సన్ పిక్చర్స్ నిర్మాణంలోని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  25 July 2019 2:20 AM GMT
Next Story