Telugu Global
Cinema & Entertainment

పాజిటివ్ టాక్ వెనక చార్మి "ఇస్మార్ట్" రాజకీయం

మొన్న గురువారం జరిగిన ఓ మాయాజాలం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజున ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా హైదరాబాద్ ఐమ్యాక్స్ లో ఉదయాన్నే షోలు పడతాయి. ఉదయం 8.45కే మీడియాకు షో ఏర్పాటుచేస్తారు నిర్మాతలు. అదే టైమ్ లో మిగిలిన టిక్కెట్లను సామాన్య ప్రేక్షకులు కూడా బుక్ చేసుకుంటారు. ఆ షో పూర్తయ్యే టైమ్ కు రాష్ట్రంలోని వెబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్, ట్విట్టర్-ఫేస్ బుక్ […]

పాజిటివ్ టాక్ వెనక చార్మి ఇస్మార్ట్ రాజకీయం
X

మొన్న గురువారం జరిగిన ఓ మాయాజాలం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజున ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా హైదరాబాద్ ఐమ్యాక్స్ లో ఉదయాన్నే షోలు పడతాయి. ఉదయం 8.45కే మీడియాకు షో ఏర్పాటుచేస్తారు నిర్మాతలు. అదే టైమ్ లో మిగిలిన టిక్కెట్లను సామాన్య ప్రేక్షకులు కూడా బుక్ చేసుకుంటారు.

ఆ షో పూర్తయ్యే టైమ్ కు రాష్ట్రంలోని వెబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్, ట్విట్టర్-ఫేస్ బుక్ హ్యాండిల్స్, యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ ఐమ్యాక్స్ ముందు వాలిపోతాయి. పబ్లిక్ టాక్ అంటూ జనాల అబిప్రాయం తీసుకొని ప్రసారం చేస్తుంటాయి. దీనికి తోడు మీడియా వాళ్లు ఇచ్చే రివ్యూలు కూడా తోడవుతాయి. ఈ రెండూ కలిసి సినిమా రిజల్ట్ ను శాసిస్తాయి. మొదటి రోజు టాక్ ఈ రెండు విభాగాల నుంచి మాత్రమే వస్తుంది.

సరిగ్గా ఇక్కడే చార్మి తన తెలివితేటలు ప్రదర్శించింది. ఐమ్యాక్స్ లో ఆరోజు 8.45 షోలు 4 స్క్రీన్స్ లో ఏర్పాటుచేశారు. ఆశ్చర్యకరంగా 4 థియేటర్లలో టిక్కెట్లు అయిపోయినట్టు బోర్డులు పెట్టారు. బుక్ మై షో లాంటి యాప్స్ లో కూడా 8.45 షోకు టిక్కెట్లు దొరకలేదు. సేమ్ టైమ్, మీడియా మిత్రులకు వేయాల్సిన 8.45 షో కూడా రద్దుచేశారు. అలా టిక్కెట్లు బ్లాక్ చేసిన చార్మి.. ఆ 4 థియేటర్లను తమ వర్గీయులతో నింపేసిందని టాక్.

రామ్ ఫ్యాన్స్ తో పాటు సినిమా గురించి పాజిటివ్ గా ఎవరెవరు మాట్లాడతారో వాళ్లందరికీ ఆ రోజున టిక్కెట్లు ఇచ్చారట. అలా 4 థియేటర్లలో యూనిట్ కు, సినిమాకు, రామ్ కు అనుకూలమైన వ్యక్తులు మాత్రమే నిండిపోయారు. ఆక్యుపెన్సీ కూడా 50శాతానికి మించి లేదు. షో పూర్తయిన తర్వాత వాళ్లంతా బయటకొచ్చి మీడియా ముందు సూపర్ హిట్ అంటూ కలరింగ్ ఇచ్చారు.

అలా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మొదటి రోజు, మొదటి ఆటకు సూపర్ హిట్ టాక్ వచ్చేలా ప్లాన్ చేసిందట చార్మి. ఈ మేరకు దాదాపు వారం రోజుల ముందు నుంచే ప్రణాళిక సిద్ధంచేసి, దాన్ని పకడ్బందీగా అమలుచేసిందని చెబుతున్నారు. నిజానికి ఇస్మార్ట్ శంకర్ కు ఆ తర్వాత మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి పూర్తిగా దూరమయ్యారు. కానీ మొదటి రోజు మొదటి ఆటకు చార్మి చేసిన “మేజిక్”తో ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ రావడం ఖాయం.

ఇప్పటికే మొదటి 10 రోజులకు టిక్కెట్ రేట్లు భారీగా పెంచి వసూళ్లు చూపించుకుంటున్నారు నిర్మాతలు. ఈ విషయంలో పెద్ద హీరోలెవరూ తగ్గడం లేదు. కొత్త సినిమా వస్తే రేట్లు పెంచేసుకుంటున్నారు. ఇది ప్రేక్షకుడికి భారంగా మారుతుంది. ఈ విపరీత పోకడకు చార్మి పాటించిన కొత్త “పథకం” కూడా తోడైతే రానున్న రోజుల్లో ఏ సినిమా హిట్ అయిందో, ఏ సినిమా ఫ్లాప్ అయిందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది.

First Published:  20 July 2019 5:33 AM GMT
Next Story