Telugu Global
Cinema & Entertainment

మనసులోని కోరికను.... తానా సభలో బయటపెట్టింది....

ఇప్పటి వరకు మనకు వ్యాఖ్యాత గా, గ్లామర్ డాల్ గా, నటి గా మాత్రమే పరిచయం అయిన అనసూయ భరద్వాజ్ త్వరలో ఒక కొత్త అవతారం ఎత్తనుంది. అయితే ఇది ఎంత వరకు ఆమెకి ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి. ఒక వైపు టీవీ షోస్, మరొక వైపు సినిమాలని బాలెన్స్ చేసుకుంటూ పోతున్న అనసూయ కి కెరీర్ లో ఎదుగుదల ముఖ్యమట. జబర్దస్త్ తో ఎంతో పాపులారిటి సంపాదించిన అనసూయ కి…. సొంతం గా సినిమాల్లో […]

మనసులోని కోరికను.... తానా సభలో బయటపెట్టింది....
X

ఇప్పటి వరకు మనకు వ్యాఖ్యాత గా, గ్లామర్ డాల్ గా, నటి గా మాత్రమే పరిచయం అయిన అనసూయ భరద్వాజ్ త్వరలో ఒక కొత్త అవతారం ఎత్తనుంది. అయితే ఇది ఎంత వరకు ఆమెకి ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి.

ఒక వైపు టీవీ షోస్, మరొక వైపు సినిమాలని బాలెన్స్ చేసుకుంటూ పోతున్న అనసూయ కి కెరీర్ లో ఎదుగుదల ముఖ్యమట. జబర్దస్త్ తో ఎంతో పాపులారిటి సంపాదించిన అనసూయ కి…. సొంతం గా సినిమాల్లో లీడ్ రోల్స్ చేసి విజయం సాధించగల మార్కెట్ ఇంకా లేదు. అయితే ఇప్పుడు ఆసక్తికరం గా ఆమె నిర్మాత గా మారబోతుంది.

అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన అనసూయ ఈ విషయం పై స్పందించింది. అక్కడ తెలుగు వాళ్ళ తో ముచ్చటిస్తూ త్వరలో తన నిర్మాణ సంస్థ కి సంబందించిన వివరాలని బయట పెడతాను అని క్లారిటీ ఇచ్చింది అనసూయ. తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు ఎంతో కొంత ప్రయత్నం చేస్తుందట. ఇలా అనసూయ మనసులోని కోరికను తానాసభలో ఇలా బయటపెట్టింది. ఈ కొత్త పని అనసూయ కి ఏ మేరకు విజయం, డబ్బులు తీసుకొని వస్తాయో చూడాలి.

First Published:  8 July 2019 3:46 AM GMT
Next Story