Telugu Global
Cinema & Entertainment

కనీసం నితిన్ అయినా ఆదుకుంటాడా?

ఇలియానా పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోవడంతో పాటు టాలీవుడ్ లో రీఎంట్రీ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆమె కెరీర్ చాలా ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చాడు నితిన్. ఆమెకు ఓ ఆఫర్ ఇచ్చాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నితిన్ కొత్త సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించనుంది. అయితే ఆమెది మెయిన్ హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. ఓ కీలక పాత్ర […]

కనీసం నితిన్ అయినా ఆదుకుంటాడా?
X

ఇలియానా పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోవడంతో పాటు టాలీవుడ్ లో రీఎంట్రీ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆమె కెరీర్ చాలా ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చాడు నితిన్. ఆమెకు ఓ ఆఫర్ ఇచ్చాడు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నితిన్ కొత్త సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించనుంది. అయితే ఆమెది మెయిన్ హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. ఓ కీలక పాత్ర మాత్రమే.

రీసెంట్ గా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు నితిన్. ఇందులో మెయిన్ హీరోయిన్ గా రకుల్ ను తీసుకున్నారు. సెకెండ్ హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియన్ ను తీసుకున్నారు. ఓ కీలకమైన పాత్రను ఇలియానాకు ఆఫర్ చేశారు.

అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ అయిన తర్వాత మరోసారి తెలుగుతెరకు దూరమైంది ఇలియానా. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఆఫర్ రావడమే ఎక్కువ. మరి నితిన్ ఇచ్చిన ఈ ఆఫర్ ను ఆమె ఒప్పుకుంటుందా లేక ఎప్పట్లానే బెట్టు చూపిస్తుందా అనేది చూడాలి. గతంలో వీళ్లిద్దరి కాంబోలో రెచ్చిపో అనే సినిమా వచ్చింది.

First Published:  7 July 2019 5:30 AM GMT
Next Story