Telugu Global
Cinema & Entertainment

వంగవీటి రంగా జయంతి.... 'దేవినేని' ఫస్ట్ లుక్

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహానటి బయోపిక్ నుంచి మొన్న విడుదలైన ‘మల్లేశం’ సినిమా వరకు ఈ ఏడాదిలో బోలెడు బయోపిక్ లు తెరకెక్కాయి. అయితే తాజాగా ఇప్పుడు ఒకప్పటి కంకిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా ‘దేవినేని’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న తారకరత్న ఈ సినిమాలో దేవినేని పాత్ర పోషించబోతున్నారు. ‘శివ […]

వంగవీటి రంగా జయంతి.... దేవినేని ఫస్ట్ లుక్
X

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహానటి బయోపిక్ నుంచి మొన్న విడుదలైన ‘మల్లేశం’ సినిమా వరకు ఈ ఏడాదిలో బోలెడు బయోపిక్ లు తెరకెక్కాయి.

అయితే తాజాగా ఇప్పుడు ఒకప్పటి కంకిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా ‘దేవినేని’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న తారకరత్న ఈ సినిమాలో దేవినేని పాత్ర పోషించబోతున్నారు.

‘శివ నాగు’ సినిమాకి దర్శకత్వం వహించిన నర్రా శివనాగేశ్వరరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ టి ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

తాజాగా వంగవీటి రంగా జయంతి సందర్భంగా ‘దేవినేని’ సినిమా నుంచి వంగవీటి రంగ గెటప్ లో సురేష్ కొండేటి పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వైట్ షెర్ట్ లో సురేష్ కొండేటి చూడటానికి దాదాపు గా వంగవీటి రంగా లానే కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో దాదాపుగా అందరూ కొత్త నటీనటులు నటించనున్నారు.

First Published:  3 July 2019 11:00 PM GMT
Next Story