Telugu Global
Cinema & Entertainment

డూప్ వద్దంటున్న 'సాహో' బ్యూటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, స్టార్ నటీనటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ మరియు మేకింగ్ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమా మేకింగ్ […]

డూప్ వద్దంటున్న సాహో బ్యూటీ
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, స్టార్ నటీనటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ మరియు మేకింగ్ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమా మేకింగ్ వీడియో లు చూస్తే సినిమా లో శ్రద్ధా కపూర్ పాత్రకు కూడా బాగా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది.

మిగతా కమర్షియల్ సినిమాలలో లాగా ఒక రెండు పాటలు, నాలుగు సన్నివేశాలకు మాత్రమే పరిమితం కాకుండా శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో కూడా పాలుపంచుకుంది. అయితే శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో కొన్ని కష్టమైన స్టంట్ లు కూడా చేసిందట.

అయితే వాటి కోసం ఎలాంటి డూప్ ను కూడా పెట్టొద్దు అని చెప్పి తానే స్వయంగా అన్ని యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించిందని తెలుస్తోంది. యు.వి క్రియేషన్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతోంది.

First Published:  29 Jun 2019 3:35 AM GMT
Next Story