Telugu Global
NEWS

అడ్డగోలుగా వీసీ అయిన.... మాజీ జేడీ సోదరుడి రాజీనామా

టీడీపీ హయాంలో అడ్డదారుల్లో అందలం ఎక్కిన వారంతా ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. పలుకుబడే అర్హతగా టీడీపీ హయాంలో చాలా నియామకాలు జరిగాయి. అందులో ఎస్వీయూ వీసీ ఒకరన్న ఆరోపణ ఉంది. ఎస్వీయూ వీసీగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోదరుడు వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌ను చంద్రబాబు ప్రభుత్వం హఠాత్తుగా అడ్డదారిలో నియమించింది. ఈ నియామకంపై కోర్టులో కేసులు కూడా నమోదు అయ్యాయి. నిజానికి ఎస్వీవర్శిటీ వీసీ నియామకం కోసం గతేడాది ఆగస్టులో నోటీఫికేషన్ వచ్చింది. కానీ వీవీఎన్‌ రాజేందప్రసాద్‌ కనీసం […]

అడ్డగోలుగా వీసీ అయిన.... మాజీ జేడీ సోదరుడి రాజీనామా
X

టీడీపీ హయాంలో అడ్డదారుల్లో అందలం ఎక్కిన వారంతా ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. పలుకుబడే అర్హతగా టీడీపీ హయాంలో చాలా నియామకాలు జరిగాయి. అందులో ఎస్వీయూ వీసీ ఒకరన్న ఆరోపణ ఉంది. ఎస్వీయూ వీసీగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోదరుడు వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌ను చంద్రబాబు ప్రభుత్వం హఠాత్తుగా అడ్డదారిలో నియమించింది. ఈ నియామకంపై కోర్టులో కేసులు కూడా నమోదు అయ్యాయి.

నిజానికి ఎస్వీవర్శిటీ వీసీ నియామకం కోసం గతేడాది ఆగస్టులో నోటీఫికేషన్ వచ్చింది. కానీ వీవీఎన్‌ రాజేందప్రసాద్‌ కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. జనవరిలో నిర్వహించిన సెర్చ్ కమిటీ సమావేశానికి వారం ముందు హడావుడిగా రాజేందప్రసాద్‌ను వీసీగా నియమించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అనుకున్నదే ఆలస్యం… అప్పటికప్పుడు వీవీఎన్ రాజేంద్రప్రసాద్ నుంచి దరఖాస్తు తెప్పించుకుని దాన్ని ఓకే చేశారు. జగన్‌పై కేసుల విషయంలో సాయపడ్డ లక్ష్మీనారాయణ రుణం తీర్చుకునేందుకు ఆయన సోదరుడైన వీవీఎన్‌ రాజేంద్రప్రసాద్‌ను అడ్డదారిలో చంద్రబాబు వీసీని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇలా నిబంధనలకు విరుద్దంగా వీసీని నియమించడంపై దాఖలైన పిటిషన్లపై ఈనెల 24న తీర్పు రావాల్సి ఉంది. తీర్పు వీసీకి వ్యతిరేకంగా వస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో వీసీ పదవికి రాజేంద్రప్రసాద్‌ రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్‌కు పంపించారు.

First Published:  20 Jun 2019 12:21 AM GMT
Next Story