Telugu Global
Cinema & Entertainment

ఐదోసారి.... శ్రియతో బాలకృష్ణ

గత కొంతకాలంగా సీనియర్ బ్యూటీ శ్రియ శరణ్ కెరీర్ ఏమంత బాగాలేదు. ఈమె నటించిన’ పైసా వసూల్’, ‘గాయత్రి’, ‘వీర భోగ వసంత రాయలు’ వంటి సినిమాలు డిజాస్టర్ లు గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో కూడా మెరుపు తీగలా వచ్చి మాయమైపోయింది. ఒకవైపు ఈమెకు టాలీవుడ్ లో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి అనుకుంటున్న సమయంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ తో ఒక సినిమా ఓకే అయిందని అంటున్నారు. ఇప్పటికే […]

ఐదోసారి.... శ్రియతో బాలకృష్ణ
X

గత కొంతకాలంగా సీనియర్ బ్యూటీ శ్రియ శరణ్ కెరీర్ ఏమంత బాగాలేదు. ఈమె నటించిన’ పైసా వసూల్’, ‘గాయత్రి’, ‘వీర భోగ వసంత రాయలు’ వంటి సినిమాలు డిజాస్టర్ లు గా నిలిచిన సంగతి తెలిసిందే.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో కూడా మెరుపు తీగలా వచ్చి మాయమైపోయింది. ఒకవైపు ఈమెకు టాలీవుడ్ లో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి అనుకుంటున్న సమయంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ తో ఒక సినిమా ఓకే అయిందని అంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ శ్రియ జంటగా బోలెడు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

‘చెన్నకేశవరెడ్డి’ సినిమా లో మొట్టమొదటిసారిగా శ్రీయ…. బాలకృష్ణ తో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’ సినిమాలలో కూడా ఈమె బాలకృష్ణ సరసన నటించింది. ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో కూడా బాలకృష్ణతో నటించింది.

ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమలో కూడా ఈమె హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే లాంచ్ అయిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావాలట. అందులో ఒక్క హీరోయిన్ గా శ్రియని దర్శక నిర్మాతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

First Published:  19 Jun 2019 2:17 AM GMT
Next Story