Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సినిమా మొదలైంది

ఎట్టకేలకు అన్ని పుకార్లకు, ఊహాగానాలకు చెక్ పెడుతూ బాలయ్య సినిమా ప్రారంభమైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఈరోజు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచాన్ చేశారు. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది కానీ వీళ్లిద్దరి కాంబోలో ఇంతకుముందు అనుకున్న సినిమా రావడం లేదు. గతంలో బాలయ్యకు […]

బాలయ్య సినిమా మొదలైంది
X

ఎట్టకేలకు అన్ని పుకార్లకు, ఊహాగానాలకు చెక్ పెడుతూ బాలయ్య సినిమా ప్రారంభమైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఈరోజు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచాన్ చేశారు. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

అంతా బాగానే ఉంటుంది కానీ వీళ్లిద్దరి కాంబోలో ఇంతకుముందు అనుకున్న సినిమా రావడం లేదు. గతంలో బాలయ్యకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పోలీస్ కథ చెప్పాడు కేఎస్ రవికుమార్. అందులో జగన్, ఆయన తాత రాజారెడ్డి పాత్రల్ని నెగెటివ్ గా చూపించేలా స్క్రిప్ట్ రెడి చేశారు. కట్ చేస్తే, జగన్ సీఎం అయ్యారు. ఇలాంటి టైమ్ లో ఈ కథతో సినిమా చేస్తే ఏమౌతుందో బాలయ్యకు బాగా తెలుసు.

అందుకే ఆఘమేఘాల మీద మరో కథ రాశాడు దర్శకుడు. కానీ అది కూడా నచ్చలేదు బాలయ్యకి. ఇక ఫైనల్ గా పరుచూరి కిరిటీ రాసిన కథతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఆ కథలో కూడా బాలయ్యది పోలీస్ పాత్రే. అలా సింక్ అయింది ఈ సినిమా.

గతంలో బాలయ్య నటించిన 2 సినిమాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ కొత్త సినిమాకు కూడా సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. సి.కల్యాణ్ నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

First Published:  13 Jun 2019 10:30 AM GMT
Next Story