Telugu Global
Cinema & Entertainment

చిన్న బ్రేక్ తీసుకున బన్నీ

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత కొన్నాళ్ళు అభిమానులని కన్ఫ్యూజన్లో పెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి […]

చిన్న బ్రేక్ తీసుకున బన్నీ
X

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత కొన్నాళ్ళు అభిమానులని కన్ఫ్యూజన్లో పెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా బన్నీ షూటింగ్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకుని, కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న హాలిడే ట్రిప్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. తిరిగివచ్చాక త్వరలో షూటింగ్ లో జాయిన్ అవుతాడట బన్నీ.

ఈ సినిమాలో బన్నీ రెండు సరికొత్త లుక్స్ తో కనిపించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘అలకనంద’ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  10 May 2019 12:55 AM GMT
Next Story