Telugu Global
Cinema & Entertainment

జాతకాలు, జన్మనక్షత్రాలు.... మోక్షజ్ఞ ఎంట్రీకి దారేది !

లెక్కప్రకారం ఈపాటికి బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ తెరపైకి రావాలి. కానీ జాతకాలు, జన్మనక్షత్రాలంటూ బాలయ్య కొడుకుని తెరవెనక్కే పరిమితం చేశారు. కట్ చేస్తే ఇప్పుడు మోక్షజ్ఞను తెరపైకి తీసుకొద్దామన్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా తయారయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ బయోపిక్ కంటే ముందే మోక్షజ్ఞను లాంచ్ చేసే కంటే.. ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ చేసి అది ఘనవిజయం సాధించిన తర్వాత మోక్షజ్ఞ తెరపైకి వస్తే బాగుంటుందని బాలయ్య భావించారు. ఆయన ఆలోచన బాగానే ఉంది. […]

జాతకాలు, జన్మనక్షత్రాలు.... మోక్షజ్ఞ ఎంట్రీకి దారేది !
X

లెక్కప్రకారం ఈపాటికి బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ తెరపైకి రావాలి. కానీ జాతకాలు, జన్మనక్షత్రాలంటూ బాలయ్య కొడుకుని తెరవెనక్కే పరిమితం చేశారు. కట్ చేస్తే ఇప్పుడు మోక్షజ్ఞను తెరపైకి తీసుకొద్దామన్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా తయారయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ బయోపిక్.

ఎన్టీఆర్ బయోపిక్ కంటే ముందే మోక్షజ్ఞను లాంచ్ చేసే కంటే.. ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ చేసి అది ఘనవిజయం సాధించిన తర్వాత మోక్షజ్ఞ తెరపైకి వస్తే బాగుంటుందని బాలయ్య భావించారు. ఆయన ఆలోచన బాగానే ఉంది. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది.

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా డబుల్ డిజాస్టర్ అవ్వగా, ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా ఎపిక్ డిజాస్టర్ గా మారింది. టాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్ల జాబితాలో ఈ రెండు సినిమాలు చేరిపోయాయి. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ డైలమాలో పడింది. స్వయంగా ఎన్టీఆర్ బయోపిక్కే ఆడని నేపథ్యంలో, కొడుకును హీరోగా తెరపైకి తీసుకొస్తే వ్యవహారం బెడిసికొడుతుందని బాలయ్య భయపడుతున్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో!

First Published:  30 April 2019 6:27 AM GMT
Next Story