Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కి..... అల్లుఅర్జున్ కలిసొచ్చేనా?

మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం అఖిల్ అక్కినేని కి హిట్ ఇచ్చే ప్రయత్నం లో ఉన్నాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో….. అఖిల్ అక్కినేని ఇప్పుడు గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో కి వచ్చాడు. నాగార్జున కూడా అల్లు అరవింద్ ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అందుకే అరవింద్ ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ నాలుగో సినిమా విజయం సాధించాలి అనే ఉదేశ్యం తో పని చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ […]

అఖిల్ కి..... అల్లుఅర్జున్ కలిసొచ్చేనా?
X

మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం అఖిల్ అక్కినేని కి హిట్ ఇచ్చే ప్రయత్నం లో ఉన్నాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో….. అఖిల్ అక్కినేని ఇప్పుడు గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో కి వచ్చాడు.

నాగార్జున కూడా అల్లు అరవింద్ ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అందుకే అరవింద్ ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ నాలుగో సినిమా విజయం సాధించాలి అనే ఉదేశ్యం తో పని చేస్తున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమా లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక చిన్న పాత్ర లో మెరవనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ పాత్ర కి కథ లో పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా ఒక అతిధి తరహా లో కథ లో కి ప్రవేశించి అందరినీ అబ్బురపరుస్తాడు అని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇక ఈ సినిమా కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా లో అఖిల్ సరసన రష్మిక కథానాయిక గా నటించే అవకాశం ఉంది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

చూడాలి… అఖిల్ కి… అల్లుఅర్జున్ స్టార్ డమ్ కలిసొస్తుందో… లేదో…!

First Published:  30 April 2019 2:32 AM GMT
Next Story