Telugu Global
NEWS

బాబు మళ్లీ రాకూడదు... ఉన్నతాధికారుల ఆశలు...!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రాకూడదని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయరాదని ఉన్నతాధికారులు ఆశలు పెట్టుకున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన ఉన్నతాధికారులు చంద్రబాబు నాయుడు విజయం సాధించకూడదని తమలో తాము చర్చించుకుంటున్నారు. అధికారులను భయపెట్టి… అధికారుల చేత పని చేయించేది మేమే  అంటూ ప్రజల దగ్గర మార్కులు కొట్టేయాలని చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చే వారని, దీని వల్ల రాష్ట్రంలో అనేకమంది […]

బాబు మళ్లీ రాకూడదు... ఉన్నతాధికారుల ఆశలు...!
X

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రాకూడదని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయరాదని ఉన్నతాధికారులు ఆశలు పెట్టుకున్నారు.

గడచిన ఐదు సంవత్సరాలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన ఉన్నతాధికారులు చంద్రబాబు నాయుడు విజయం సాధించకూడదని తమలో తాము చర్చించుకుంటున్నారు. అధికారులను భయపెట్టి… అధికారుల చేత పని చేయించేది మేమే అంటూ ప్రజల దగ్గర మార్కులు కొట్టేయాలని చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చే వారని, దీని వల్ల రాష్ట్రంలో అనేకమంది అధికారులు ఇబ్బందులు పాలయ్యారని వారు అంటున్నారు.

తమ అధికారం కోసం ప్రజలకు విచక్షణారహితంగా హామీలు ఇవ్వడం, ఏదైనా చేస్తాం అంటూ చెప్పడంతో వాటిని నెరవేర్చలేక తాము ఇబ్బందులు పడుతున్నామని అధికారులు అంటున్నారు. ప్రజల్లో తమను చులకన చేయడం, దేవుడు వరమిచ్చినా… పూజారి కనికరం చూపించడం లేదని చెప్తూ ప్రజల ముందు తమను దోషులుగా చిత్రీకరిస్తున్నారన్నది అధికారుల అభిప్రాయం.

గతంలో చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుకు మధ్య చాలా తేడా ఉందని, తమవారి కోసం ఎంతటి అధికారినైనా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య పాలనా పరమైన ఇబ్బందులు ఉండాలి తప్ప రాజకీయ విభేదాలు ఉండకూడదని, అలాంటి విభేదాలు వచ్చినప్పుడు అధికారులను టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.

తమ వారికి మేలు చేయాలంటూ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి పని అయినా చేయాలని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు అనేది ఉన్నతాధికారులు అభిప్రాయం.

సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా ఏ పని అయినా చేయాల్సిందేనంటూ చంద్రబాబు నాయుడు, ఆయన సహచరులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికారులను బెదిరిస్తున్నారని వారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడాలంటే చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రాకూడదని వారిలో వారు చర్చించుకున్నట్టు సమాచారం.

First Published:  27 April 2019 11:02 PM GMT
Next Story