Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు సినిమాలో రమ్యకృష్ణ 

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మహర్షి’ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు హ్యాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి తో మాస్ ఎంటర్ టైనర్ సినిమా చేయబోతున్నాడు. జగపతిబాబు, విజయశాంతి, బండ్ల గణేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నట్లు గా ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా […]

మహేష్ బాబు సినిమాలో రమ్యకృష్ణ 
X

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మహర్షి’ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు హ్యాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి తో మాస్ ఎంటర్ టైనర్ సినిమా చేయబోతున్నాడు.

జగపతిబాబు, విజయశాంతి, బండ్ల గణేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నట్లు గా ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి మొదలు కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు గా తెలుస్తోంది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ కు ఒక ఆసక్తికరమైన మరియు కష్టమైన పాత్ర దక్కింది అని తెలుస్తోంది. తన పాత్ర విపరీతంగా నచ్చేయడంతో రమ్యకృష్ణ వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేసిందని సమాచారం.

ఎలాగో రమ్యకృష్ణకు తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో మంచి పాపులారిటీ ఉండటంతో ఈ సినిమాకు బాగానే మార్కెట్ అయ్యేలాగా కనిపిస్తోంది. ఇక వరుస సూపర్ హిట్ సినిమాలతో అనిల్ రావిపూడి మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈసారి కూడా మహేష్ బాబు తో ఒక ఫుల్ లెంత్ ఎంటర్ టైనింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తాడని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

First Published:  26 April 2019 11:13 PM GMT
Next Story