Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య, సమంత కాంబోలో మరో మూవీ

రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి మజిలీ సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయింది. దీంతో ఈ కాంబినేషన్ ను మరోసారి కలిపేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా దర్శకుడు అజయ్ భూపతి ఓ మంచి కథతో నాగచైతన్యను సంప్రదించాడు. నాగచైతన్యకు మహాసముద్రం అనే స్టోరీ వినిపించాడు అజయ్ భూపతి. గతంలో ఈ దర్శకుడు ఆర్ఎక్స్100 సినిమా తీసిన విషయం తెలిసిందే. అలాంటిదే ఓ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ తో మహాసముద్రం కథ రాసుకున్నాడట. ఇందులో […]

నాగచైతన్య, సమంత కాంబోలో మరో మూవీ
X

రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి మజిలీ సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయింది. దీంతో ఈ కాంబినేషన్ ను మరోసారి కలిపేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా దర్శకుడు అజయ్ భూపతి ఓ మంచి కథతో నాగచైతన్యను సంప్రదించాడు.

నాగచైతన్యకు మహాసముద్రం అనే స్టోరీ వినిపించాడు అజయ్ భూపతి. గతంలో ఈ దర్శకుడు ఆర్ఎక్స్100 సినిమా తీసిన విషయం తెలిసిందే. అలాంటిదే ఓ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ తో మహాసముద్రం కథ రాసుకున్నాడట. ఇందులో నాగచైతన్యది పోలీసాఫీసర్ పాత్ర. ఇదే సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ క్యారెక్టర్ కోసం సమంత అయితే బాగుంటుందని అంటున్నాడు అజయ్ భూపతి.

ప్రస్తుతానికి ఈ సినిమా చర్చల దశలో ఉంది. నాగచైతన్య ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే మాస్ మూవీస్ నాగచైతన్యకు కలిసిరాలేదు. అందుకే డైలమాలో ఉన్నాడు. ఒక్కసారి చేయాలని ఫిక్స్ అయితే సమంతను ఒప్పించడం నాగచైతన్యకు పెద్ద పని కాదు.

First Published:  27 April 2019 11:30 AM GMT
Next Story