Telugu Global
Cinema & Entertainment

కల్కి సినిమాపై దృష్టి పెట్టిన ధనుష్.... కానీ....

ఈ మధ్యన ‘పిఎస్వి గరుడ వేగ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో ‘కల్కి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత రాధామోహన్ […]

కల్కి సినిమాపై దృష్టి పెట్టిన ధనుష్.... కానీ....
X

ఈ మధ్యన ‘పిఎస్వి గరుడ వేగ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో ‘కల్కి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత రాధామోహన్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. 12 కోట్లకు ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన వండర్ బార్ నిర్మాణ సంస్థను తెలుగులో కూడా విస్తరించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ‘కల్కి’ సినిమా కి సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్ ను అడిగినట్లు దాని కోసం భారీ మొత్తాన్ని ఇస్తాం అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ డీల్ ను రాధ మోహన్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఈచిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయి కాబట్టి ‘కల్కి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కనీసం పది కోట్లు అయినా రాబట్టాల్సి ఉంటోంది.

First Published:  22 April 2019 2:17 AM GMT
Next Story