Telugu Global
NEWS

భారీగా పట్టుబడిన పరిటాల డబ్బు

అనంతపురం జిల్లాలో డబ్బుల ఎన్నికగా రాప్తాడు నియోజక వర్గం నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రి పరిటాల సునీత తన కుమారుడు శ్రీరాంను ఈసారి బరిలో దింపారు. పోరు హోరాహోరీగా ఉండడంతో ఎలాగైనా కుమారుడిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఆమె ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లకు భారీగా డబ్బు పంచేందుకు వారు సిద్దమైనట్టు చెబుతున్నారు. ఓటుకు ఆరు వేల నుంచి 10వేల వరకు పంచేందుకు సిద్ధమయ్యారు. తొలి సారి పోటీ చేస్తుండడంతో శ్రీరాంను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోనివ్వకూడదని పరిటాల వర్గం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేత ముకుందనాయుడు గ్రామాల్లో తిరుగుతూ పరిటాల […]

భారీగా పట్టుబడిన పరిటాల డబ్బు
X

అనంతపురం జిల్లాలో డబ్బుల ఎన్నికగా రాప్తాడు నియోజక వర్గం నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రి పరిటాల సునీత తన కుమారుడు శ్రీరాంను ఈసారి బరిలో దింపారు. పోరు హోరాహోరీగా ఉండడంతో ఎలాగైనా కుమారుడిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఆమె ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఓటర్లకు భారీగా డబ్బు పంచేందుకు వారు సిద్దమైనట్టు చెబుతున్నారు. ఓటుకు ఆరు వేల నుంచి 10వేల వరకు పంచేందుకు సిద్ధమయ్యారు. తొలి సారి పోటీ చేస్తుండడంతో శ్రీరాంను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోనివ్వకూడదని పరిటాల వర్గం ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే టీడీపీ నేత ముకుందనాయుడు గ్రామాల్లో తిరుగుతూ పరిటాల శ్రీరాంకు ఓటేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని… ఓటు వేసి తీరాల్సిందేనని ప్రచార రథంపై నుంచే వార్నింగులు ఇస్తున్నారు. ఇప్పుడు భారీగా డబ్బు, మద్యాన్ని కూడా రాప్తాడులో దింపుతున్నారు.

ఇదే తరహాలో హైదరాబాద్‌ నుంచి రాప్తాడుకు తరలిస్తున్న డబ్బును హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక ప్రైవేట్ టావెల్స్ బస్సులో 24 లక్షలు బయటపడింది. ఈ డబ్బును రాప్తాడుకు తరలిస్తున్నారు.

పరిటాల సునీత బంధువు, రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌ కారు డ్రైవర్ సంతోష్ రెడ్డి ఈ డబ్బును తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. డబ్బును సీజ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలకు భారీగా పరిటాల కుటుంబం డబ్బులు తరలిస్తున్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

First Published:  1 April 2019 10:27 PM GMT
Next Story