Telugu Global
NEWS

మంత్రుల సీట్ల‌కు ఎస‌రు... టెన్ష‌న్‌లో టీడీపీ నేత‌లు !

ఎల‌క్ష‌న్ షెడ్యూల్ వ‌చ్చింది. ఇక టికెట్ల పంచాయ‌తీ మిగిలింది. రేపోమాపో పార్టీలు అభ్యర్ధుల లిస్ట్ ను విడుదల చేస్తాయనే ప్రచారం జ‌రుగుతోంది. టీడీపీలో మాత్రం టికెట్ల పంచాయ‌తీ ఇంకా కొనసాగుతోంది. తెల్ల‌వారుజాము వ‌ర‌కు టికెట్ల కోసం నేత‌లు చంద్ర‌బాబు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు. కానీ భ‌రోసా మాత్రం నేత‌లకు దొర‌క‌డం లేదు. లాబీయింగ్ చేసేవారికి టికెట్లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. ఏకంగా మంత్రుల సీట్లకు ఇప్పుడు ఎస‌రు వ‌చ్చి ప‌డింది. గంటా శ్రీనివాసరావు, సిద్దా రాఘ‌వ‌రావుల‌ను ఎంపీలుగా పోటీ […]

మంత్రుల సీట్ల‌కు ఎస‌రు... టెన్ష‌న్‌లో టీడీపీ నేత‌లు !
X

ఎల‌క్ష‌న్ షెడ్యూల్ వ‌చ్చింది. ఇక టికెట్ల పంచాయ‌తీ మిగిలింది. రేపోమాపో పార్టీలు అభ్యర్ధుల లిస్ట్ ను విడుదల చేస్తాయనే ప్రచారం జ‌రుగుతోంది. టీడీపీలో మాత్రం టికెట్ల పంచాయ‌తీ ఇంకా కొనసాగుతోంది. తెల్ల‌వారుజాము వ‌ర‌కు టికెట్ల కోసం నేత‌లు చంద్ర‌బాబు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు. కానీ భ‌రోసా మాత్రం నేత‌లకు దొర‌క‌డం లేదు. లాబీయింగ్ చేసేవారికి టికెట్లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం న‌డుస్తోంది.

ఏకంగా మంత్రుల సీట్లకు ఇప్పుడు ఎస‌రు వ‌చ్చి ప‌డింది. గంటా శ్రీనివాసరావు, సిద్దా రాఘ‌వ‌రావుల‌ను ఎంపీలుగా పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు కోరారు. అన‌కాప‌ల్లి అసెంబ్లీ లేదా విశాఖ ఎంపీగా పోటీచేయాల‌ని మంత్రి గంటాను కోరుతున్న‌ట్లు చెబుతున్నారు.

అయితే ఆయ‌న మాత్రం విశాఖ నార్త్‌ లేదా చోడ‌వ‌రం సీటు కావాల‌ని అడుగుతున్నార‌ట‌. వీలైతే భీమిలి ఇస్తే స‌ర్దుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. మ‌రోవైపు సిద్ధా రాఘ‌వ‌రావుకు చంద్ర‌బాబు ఒంగోలు ఎంపీగా ఆఫ‌ర్ ఇచ్చారు. దీంతో ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌తో ధ‌ర్నాలు చేయిస్తున్నారు. త‌న‌కు ద‌ర్శి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాన‌ని అంటున్నారు.

మంత్రి కాల్వ శ్రీనివాసులుకు కూడా సీటు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద‌రెడ్డి కూడా త‌మ‌కు టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. స్పీక‌ర్ కోడెల‌ను న‌ర‌స‌రావుపేట నుంచి ఎంపీగా బ‌రిలోకి దిగాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. ఆయ‌న మాత్రం ఒప్పుకోవ‌డం లేదు.

మంత్రి జ‌వ‌హ‌ర్‌కు కోవూరు సీటుపై స్ప‌ష్ట‌త లేదు. ఆయ‌న‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామ‌ని ఇప్పుటికే వ్య‌తిరేక‌వ‌ర్గం వార్నింగ్‌లు ఇచ్చింది. దీంతో ఆయన సీటు మారుస్తార‌ని ప్ర‌చారం న‌డుస్తోంది.

మ‌చిలీప‌ట్నం సిట్టింగ్ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణను పెడ‌న ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తార‌ని తెలుస్తోంది. వంగ‌వీటి రాధాను మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేయించాల‌నే ఆలోచ‌న చేస్తున్నారట. అయితే అధినేత చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో నేత‌లే కాదు…. కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది.

First Published:  12 March 2019 4:16 AM GMT
Next Story