Telugu Global
NEWS

స్పీకర్ కే జలక్ ఇస్తున్న బాబు

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను బాబు సైడ్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల ముందు గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని బాబు హామీ ఇచ్చాడట.. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ కనీసం అసెంబ్లీ సీటు కూడా కోడెలకు ఇచ్చే పరిస్థితిలో లేరని వార్తలొస్తున్నాయి. తాజాగా నరసరావుపేట ఎంపీ సీటు బరిలో కోడెలను దించడానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే దీనికి కోడెల ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. తాను మళ్లీ […]

స్పీకర్ కే జలక్ ఇస్తున్న బాబు
X

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను బాబు సైడ్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల ముందు గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని బాబు హామీ ఇచ్చాడట.. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ కనీసం అసెంబ్లీ సీటు కూడా కోడెలకు ఇచ్చే పరిస్థితిలో లేరని వార్తలొస్తున్నాయి.

తాజాగా నరసరావుపేట ఎంపీ సీటు బరిలో కోడెలను దించడానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే దీనికి కోడెల ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. తాను మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోనే దిగుతానని కోడెల బాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇప్పటికే నరసరావుపేటలో ఎంపీగా ఉన్న రాయపాటి స్థానంలో కోడెలను పంపితే…. ఒక మంత్రి పదవి దక్కడంతోపాటు ఎమ్మెల్యే సీటును కాపాడుకోవచ్చని బాబు ప్లాన్ చేశారు. కానీ తనకు ఢిల్లీ రాజకీయాలు పడవని.. ఎంపీగా పోటీచేయాలని ఎన్టీఆర్ కోరినా తాను ఎమ్మెల్యేగానే పోటీచేశానని కోడెల బాబుతో ఖరాకండీగా చెప్పారట.

అంతేకాకుండా నరసరావుపేట కోడెలకు కలిసి రాలేదు. అక్కడి నుంచి రెండు సార్లు పోటీచేసి కోడెల ఓడిపోయారు. టీడీపీ కూడా ఆ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఓడిపోయింది. అలాంటి ఓడిపోయే చోట బాబు తనను దించుతా అనడంపై కోడెల గుర్రుగా ఉన్నారట.

ఎంపీగా పోటీచేయనని.. ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కోడెల బాబుకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. సత్తెనపల్లి నుంచి కోడెల తనయుడు బరిలోకి దిగుతుండడంతో కోడెల సీటుపై బాబు స్పష్టత ఇవ్వడం లేదని సమాచారం.

First Published:  8 March 2019 12:11 AM GMT
Next Story