Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్.. ఈసారి ఇంకాస్త పెద్ద షెడ్యూల్

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్ట్స్ షెడ్యూల్‌ను మరింత పెద్దగా ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇన్నాళ్లూ హైదరాబాద్‌లోనే షూటింగ్ చేసిన యూనిట్, ఫస్ట్ టైం రాష్ట్రం దాటి బయటకు వెళ్లబోతోంది. అవును.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం ఈసారి కేరళను ఫిక్స్ చేశాడు రాజమౌళి. అక్కడున్న కొన్ని ప్రత్యేకమైన లొకేషన్లలో ఈ సినిమాకు సంబంధించి […]

ఆర్ఆర్ఆర్.. ఈసారి ఇంకాస్త పెద్ద షెడ్యూల్
X

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్ట్స్ షెడ్యూల్‌ను మరింత పెద్దగా ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇన్నాళ్లూ హైదరాబాద్‌లోనే షూటింగ్ చేసిన యూనిట్, ఫస్ట్ టైం రాష్ట్రం దాటి బయటకు వెళ్లబోతోంది.

అవును.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం ఈసారి కేరళను ఫిక్స్ చేశాడు రాజమౌళి. అక్కడున్న కొన్ని ప్రత్యేకమైన లొకేషన్లలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తీయబోతున్నాడు. ఈ షెడ్యూల్‌లో కూడా హీరోలిద్దరూ పాల్గొంటారు. ఈ షెడ్యూల్ ఏకథాటిగా 40 రోజుల పాటు సాగబోతోంది.

ఈ నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. బర్త్ డే సందర్భంగా మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ వస్తుందని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంత తొందరగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే బజ్ తగ్గిపోతుందని రాజమౌళి భావిస్తున్నాడట. అందుకే బర్త్ డే టైమ్ లో కాకుండా, కేరళ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఫస్ట్ లుక్ విడుదల చేయాలని భావిస్తున్నాడట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లను ఎవరనే విషయాన్ని రాజమౌళి ఇంకా బయటపెట్టలేదు.

First Published:  5 March 2019 8:00 AM GMT
Next Story