Telugu Global
Cinema & Entertainment

ఇషా కొప్పికర్ అలా బుక్ అయిపోయింది

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఎవరు, ఎలా దొరికిపోతారో ఊహించడం కష్టం. ఎంత పద్ధతిగా మాట్లాడినా ఏదో ఒక యాంగిల్ లో బుక్ అయిన సెలబ్రిటీలు కోకొల్లలు. అయితే ఇక్కడ వ్యవహారం అలాంటిది కాదు. సోషల్ మీడియాలో బుక్ అవ్వడం కోసమే, వివాదాస్పదంగా మాట్లాడింది మాజీ హీరోయిన్ ఇషా కొప్పికర్. గతంలో పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన ఈమె తాజాగా విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టింది. తనకు తమిళ్ లో అజిత్ అంటే ఇష్టమని, కానీ […]

ఇషా కొప్పికర్ అలా బుక్ అయిపోయింది
X

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఎవరు, ఎలా దొరికిపోతారో ఊహించడం కష్టం. ఎంత పద్ధతిగా మాట్లాడినా ఏదో ఒక యాంగిల్ లో బుక్ అయిన సెలబ్రిటీలు కోకొల్లలు. అయితే ఇక్కడ వ్యవహారం అలాంటిది కాదు. సోషల్ మీడియాలో బుక్ అవ్వడం కోసమే, వివాదాస్పదంగా మాట్లాడింది మాజీ హీరోయిన్ ఇషా కొప్పికర్.

గతంలో పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన ఈమె తాజాగా విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టింది. తనకు తమిళ్ లో అజిత్ అంటే ఇష్టమని, కానీ ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడో తెలియదని వ్యాఖ్యానించింది. ఇక విజయ్ విషయానికొస్తే, కోలీవుడ్ సూపర్ స్టార్ అతడే అని తేల్చేసింది. దీంతో అజిత్ ఫ్యాన్స్, ఇషాపై ఆన్ లైన్ యుద్ధం ప్రకటించారు.

అసలే కోలీవుడ్ లో అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రజనీకాంత్ తర్వాత స్థానం అజిత్ దే అంటారు వాళ్ల ఫ్యాన్స్, ఈ విషయాన్ని విజయ్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇలాంటి టైమ్ లో ఈ వివాదాన్ని మరోసారి కెలికింది ఇషా కొప్పికర్. అజిత్ రీసెంట్ సినిమా పెద్ద హిట్ అయింది తెలుసా అంటూ ఇషా కొప్పికర్ పై ట్రోలింగ్ షురూ చేశారు ఫ్యాన్స్.

కేవలం వివాదాన్ని రేపడం కోసం, కాస్త లైమ్ లైట్లోకి రావడం కోసమే ఇషా కొప్పికర్ ఇలా మాట్లాడిందనే విషయం ఇక్కడ స్పష్టమౌతూనే ఉంది. కానీ దీని వల్ల ఆమెకు తమిళనాట పూర్తిగా అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరోవైపు ఇషా మాత్రం తన వ్యాఖ్యల్ని ఫ్యాన్స్ వక్రీకరించారని అంటోంది. అజిత్ ను ఈమధ్య తను కలవలేదని మాత్రమే అన్నానని, తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదని అనలేదని అంటోంది.

First Published:  4 March 2019 1:28 AM GMT
Next Story