Telugu Global
Cinema & Entertainment

నాగశౌర్య సరసన షాలినీ పాండే

ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన నాగశౌర్య మళ్లీ స్పీడ్ పెంచాడు. వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇందులో భాగంగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ నిర్మాతగా ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. అర్జున్ రెడ్డి ఫేం షాలినీ పాండేను సెలక్ట్ చేశారు. నాగశౌర్య, షాలినీ పాండే కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కాశీ విశాల్ ను దర్శకుడిగా పరిచయం […]

నాగశౌర్య సరసన షాలినీ పాండే
X

ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన నాగశౌర్య మళ్లీ స్పీడ్ పెంచాడు. వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇందులో భాగంగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ నిర్మాతగా ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. అర్జున్ రెడ్డి ఫేం షాలినీ పాండేను సెలక్ట్ చేశారు. నాగశౌర్య, షాలినీ పాండే కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కాశీ విశాల్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ ఓ సినిమా నిర్మించబోతున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్ మారార్, ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. మొదటి షెడ్యూల్ లోనే షాలినీ పాండే జాయిన్ అవుతుంది.

రీసెంట్ గా 118 సినిమా చేసింది షాలినీ పాండే. అటు తమిళనాట కూడా ఎంట్రీ ఇచ్చింది. మిగతా హీరోయిన్లలా ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయట్లేదు. తన మనసుకు నచ్చిన మంచి పాత్రల్ని మాత్రమే సెలక్ట్ చేసుకుంటుంది. నాగశౌర్య సినిమాలో కూడా అలాంటి వెయిట్ ఉన్న క్యారెక్టర్ దొరకడంతో ఓకే చెప్పిందట షాలినీ పాండే.

First Published:  3 March 2019 1:49 AM GMT
Next Story