Telugu Global
NEWS

పవన్‌ కల్యాణ్‌ను పాకిస్థాన్ వాళ్లు ఓన్ చేసుకుంటున్నారు...

రెండు రోజులకే అభినందన్‌ను తిరిగి అప్పగించేలా పాకిస్థాన్‌ మెడలు వచ్చేలా చేసిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. పాకిస్థాన్‌ ప్రభుత్వ పనితీరుపై అక్కడి ప్రజలే అసంతృప్తిగా ఉంటే… భారత్‌లోని కొందరు నేతలు, నటులకు మాత్రం పాకిస్థాన్‌ హీరోగా కనిపిస్తోందన్నారు. పాకిస్థాన్‌కు ఉత్సాహం ఇచ్చేలా భారత్‌లోని కొందరు నేతలు, నటులు మాట్లాడుతున్నారన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా, పాకిస్థాన్‌ను హీరోను చేసేలా ఉన్నాయన్నారు. పవన్ కల్యాణ్‌ను పీకే అంటామని… కానీ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత పాకిస్థాన్‌లోని ప్రజలు […]

పవన్‌ కల్యాణ్‌ను పాకిస్థాన్ వాళ్లు ఓన్ చేసుకుంటున్నారు...
X

రెండు రోజులకే అభినందన్‌ను తిరిగి అప్పగించేలా పాకిస్థాన్‌ మెడలు వచ్చేలా చేసిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. పాకిస్థాన్‌ ప్రభుత్వ పనితీరుపై అక్కడి ప్రజలే అసంతృప్తిగా ఉంటే… భారత్‌లోని కొందరు నేతలు, నటులకు మాత్రం పాకిస్థాన్‌ హీరోగా కనిపిస్తోందన్నారు.

పాకిస్థాన్‌కు ఉత్సాహం ఇచ్చేలా భారత్‌లోని కొందరు నేతలు, నటులు మాట్లాడుతున్నారన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా, పాకిస్థాన్‌ను హీరోను చేసేలా ఉన్నాయన్నారు. పవన్ కల్యాణ్‌ను పీకే అంటామని… కానీ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత పాకిస్థాన్‌లోని ప్రజలు పీకే అంటే తమ వాడేనేమో అని
భావిస్తున్నారన్నారు.

పవన్‌ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందన్నారు. రాజకీయం కోసం దేశ భద్రతను దెబ్బతీసేలా పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలున్నాయన్నారు. నటుడు శివాజీ వ్యాఖ్యలను ఇటీవల ప్రజలు పట్టించుకోవడం లేదని… అందుకే పవన్‌ కల్యాణ్‌ను
చంద్రబాబు తెరపైకి తెచ్చి మాట్లాడిస్తున్నారన్నారు.

ఇటీవల చంద్రబాబును పవన్‌ కల్యాణ్ ఏమీ అనడం లేదని… వారిద్దరూ కలిసిపోవడంలో తప్పులేదన్నారు. కానీ దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా మాట్లాడడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే తనతో కొందరు చెప్పారంటున్న పవన్‌ కల్యాణ్… అలా చెప్పిన వారు ఎవరో బయటపెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

First Published:  2 March 2019 12:12 AM GMT
Next Story