Telugu Global
NEWS

రాప్తాడు, ధర్మవరంలో కళ్లు తిరిగేలా ఓట్ల స్కాం....

చరిత్రలో ఎన్నడూ లేని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రత్యర్థుల ఓట్లను మాయం చేసే మాయకు తెగబడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై దుమారం రేగుతోంది. అనంతపురం జిల్లాలోనూ పరిస్థితి అలాగే ఉంది. హఠాత్తుగా ఓట్లు ఆన్‌లైన్‌లోనే మాయమైపోతున్నాయి. తమ ఓట్లు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో వేలకు వేలు దొంగ దరఖాస్తులు వస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు రావడం చూసి అధికారులు కూడా దీని వెనుక ఏదో కుట్ర ఖచ్చితంగా ఉందని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో […]

రాప్తాడు, ధర్మవరంలో కళ్లు తిరిగేలా ఓట్ల స్కాం....
X

చరిత్రలో ఎన్నడూ లేని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రత్యర్థుల ఓట్లను మాయం చేసే మాయకు తెగబడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై దుమారం రేగుతోంది. అనంతపురం జిల్లాలోనూ పరిస్థితి అలాగే ఉంది. హఠాత్తుగా ఓట్లు ఆన్‌లైన్‌లోనే మాయమైపోతున్నాయి. తమ ఓట్లు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో వేలకు వేలు దొంగ దరఖాస్తులు వస్తున్నాయి.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు రావడం చూసి అధికారులు కూడా దీని వెనుక ఏదో కుట్ర ఖచ్చితంగా ఉందని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో ఈ తంతు హద్దులు దాటిపోయింది.

రాప్తాడులో 14వేల 812, ధర్మవరంలో 20వేల 360 దరఖాస్తులు ఓట్ల తొలగింపు కోసం రాగా… మిగిలిన నియోజక వర్గాల్లో వీటి సంఖ్య వంద నుంచి 600 వరకే ఉంది. దీని బట్టి రాప్తాడు, ధర్మవరం నియోజక వర్గాల్లో ఓట్ల తొలగింపు కుంభకోణానికి తెరలేచినట్టు అధికారులు కూడా అనుమానిస్తున్నారు.

ఓటు తొలగించాలంటూ రాప్తాడు నియోజకవర్గంలో ఏకంగా 14వేల 812 దరఖాస్తులు వచ్చాయి. అనుమానం వచ్చిన అధికారులు రాండమ్‌గా క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు పరిశీలనలో 1357 మంది తాను ఓటు
తొలగించాలంటూ అసలు దరఖాస్తే చేయలేదని చెప్పారు. దాంతో కుట్ర పూరితంగా ఎవరో ఇలా ఓట్ల తొలగింపుకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేస్తున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఓట్ల తొలగింపుకు వచ్చిన 14 వేల 812 దరఖాస్తుల్లో
ఇంకా చాలా వాటిని నిజమో కాదో పరిశీలించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

అటు ధర్మవరం నియోజకవర్గంలో ఏకంగా ఓట్ల తొలగింపు కోరుతూ 20వేల 360 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో 4వేల 819 దరఖాస్తులు ఫేక్ అని తేలింది. ఇంకా 7వేల, 568 దరఖాస్తులను పరిశీలించాల్సి
ఉంది. రాప్తాడు, ధర్మవరం నియోజవర్గంలో ఇదంతా కుట్రపూరితంగా సాగుతున్న వ్యవహారంగా భావిస్తున్నారు.

First Published:  26 Feb 2019 8:47 PM GMT
Next Story