Telugu Global
NEWS

సెల్యూట్ కు సై... డబ్బులు మాత్రం నై!!

ఇది ఎవరి గురించో కాదు. ఘనత వహించిన మన సినీ హీరోలు, దర్శకుల గురించి. సినిమాల్లో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోలందరూ సైనికుల పాత్ర పోషించిన వారే. వారి ధైర్యసాహసాలను సైనికుల కంటే ఎక్కువగా వెండితెర మీద ఆయా దర్శకులు ఆవిష్కరించారు. అది సైనికుల మీద ప్రేమ కాదు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్  కొల్లగొట్టేందుకే అని ప్రేక్షకులు అంటున్నారు. వెండితెర మీదే కాదు వాస్తవం కూడా అలాగే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో 49 సైనికులు చనిపోయిన […]

సెల్యూట్ కు సై... డబ్బులు మాత్రం నై!!
X

ఇది ఎవరి గురించో కాదు. ఘనత వహించిన మన సినీ హీరోలు, దర్శకుల గురించి. సినిమాల్లో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోలందరూ సైనికుల పాత్ర పోషించిన వారే. వారి ధైర్యసాహసాలను సైనికుల కంటే ఎక్కువగా వెండితెర మీద ఆయా దర్శకులు ఆవిష్కరించారు. అది సైనికుల మీద ప్రేమ కాదు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టేందుకే అని ప్రేక్షకులు అంటున్నారు.

వెండితెర మీదే కాదు వాస్తవం కూడా అలాగే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో 49 సైనికులు చనిపోయిన తర్వాత మన తెలుగు హీరోలు సెల్యూట్ చెప్పారు. అంతేనా మంగళవారం నాడు జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో మన సైనికుల ప్రతిభా పాటవాలను కొనియాడారు. వారి ధైర్యసాహసాలకు మెచ్చిన హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు రాజమౌళి వంటి ఎంతోమంది సినీ పరిశ్రమకు చెందిన వారు సైనికుల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేశారు.

తాము నటించే ప్రతి సినిమాకి, దర్శకత్వం వహించే సినిమాలకు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు, దర్శకులు మాత్రం పుల్వామా దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు మాత్రం మనసు రావడం లేదంటున్నారు.

అయితే, పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు అల్లు అర్జున్ వంటి కొందరు హీరోలు మాత్రం వారికి చేతనైన సాయం వారు చేయడం గమనార్హం. తమ వ్యాపార సంస్థలకు, వాణిజ్య సంస్థలకు లక్షలకు లక్షలు పన్నులు ఎగనామం పెట్టే హీరోలు వీరమరణం పొందారని చెబుతున్న సైనికుల కుటుంబాలకు మాత్రం ఒక సెల్యూట్ తో సరి పెట్టారని సినీ అభిమానులు విమర్శిస్తున్నారు.

వారే కాదు వివిధ రంగాలకు చెందిన వారు కూడా సినీ పరిశ్రమకు చెందిన వారి సెల్యూట్ ఔదార్యానికి మండిపడుతున్నారు. సైనికుల కుటుంబాలను ఆదుకోని సినీ హీరోలు, దర్శకులకు హీరోలను సైనికులుగా చూపిస్తూ సినిమాలు తీసే అర్హత లేదని అంటున్నారు.

First Published:  26 Feb 2019 11:00 PM GMT
Next Story