Telugu Global
Cinema & Entertainment

మజిలీ ముగిసింది.... విడుదలే ఆలస్యం

రియల్ లైఫ్ భార్యాభర్తలు నాగచైతన్య, సమంత కలిసి చేస్తున్న నాలుగో చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నిన్నటితో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్యాచ్ వర్క్ తో పాటు టోటల్ షూటింగ్ ను కంప్లీట్ చేసిన యూనిట్.. ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది. మజిలీ సినిమాను ఏప్రిల్ 5న విడుదల […]

మజిలీ ముగిసింది.... విడుదలే ఆలస్యం
X

రియల్ లైఫ్ భార్యాభర్తలు నాగచైతన్య, సమంత కలిసి చేస్తున్న నాలుగో చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నిన్నటితో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్యాచ్ వర్క్ తో పాటు టోటల్ షూటింగ్ ను కంప్లీట్ చేసిన యూనిట్.. ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది.

మజిలీ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. తాజాగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ హ్యాపీగా ఉంది. దీనికి తోడు ఓవర్సీస్ మినహా అన్ని ఏరియాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా పూర్తిచేశారు. మజిలీ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. అటు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ సంస్థ 5 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఓవర్సీస్ కూడా పూర్తయితే సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పై ఓ అంచనా వస్తుంది.

నాగచైతన్య గత చిత్రం సవ్యసాచి ఫ్లాప్ అయింది. దీంతో చైతూపై ఒత్తిడి పెరిగింది. మజిలీ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే. అందుకే తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు నాగచైతన్య. షైన్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  23 Feb 2019 1:13 AM GMT
Next Story