Telugu Global
NEWS

చానెళ్ల‌కు టీడీపీ ప్ర‌త్యేక ప్యాకేజీ !

ఎన్నిక‌ల వేళ ప‌త్రిక‌ల‌కు ప్యాకేజీలు కామ‌న్‌గా మారాయి. ఇప్పుడు చానెళ్ల‌కు కూడా ప్యాకేజీలు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇంత‌కుముందు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ప్యాకేజీలు ఇచ్చేవారు. ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌చారానికి ప్రాధాన్య‌త ఇచ్చేందుకు ప్యాకేజీలు ప్ర‌క‌టించేవారు. కానీ ఇప్పుడు ఎన్నిక‌ల సీజ‌న్‌కు ముందే ఏపీలో ప్యాకేజీలను టీడీపీ ఇచ్చేసింది. తెలుగు టీవీ చాన‌ళ్ల రేటింగ్‌లో రెండు, మూడు స్థానాల్లో ఉండే చాన‌ళ్ల‌కు టీడీపీ ఎన్నిక‌ల ప్యాకేజీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ రెండు చాన‌ళ్లు టీడీపీ అనుకూల […]

చానెళ్ల‌కు టీడీపీ ప్ర‌త్యేక ప్యాకేజీ !
X

ఎన్నిక‌ల వేళ ప‌త్రిక‌ల‌కు ప్యాకేజీలు కామ‌న్‌గా మారాయి. ఇప్పుడు చానెళ్ల‌కు కూడా ప్యాకేజీలు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇంత‌కుముందు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ప్యాకేజీలు ఇచ్చేవారు. ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌చారానికి ప్రాధాన్య‌త ఇచ్చేందుకు ప్యాకేజీలు ప్ర‌క‌టించేవారు. కానీ ఇప్పుడు ఎన్నిక‌ల సీజ‌న్‌కు ముందే ఏపీలో ప్యాకేజీలను టీడీపీ ఇచ్చేసింది.

తెలుగు టీవీ చాన‌ళ్ల రేటింగ్‌లో రెండు, మూడు స్థానాల్లో ఉండే చాన‌ళ్ల‌కు టీడీపీ ఎన్నిక‌ల ప్యాకేజీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ రెండు చాన‌ళ్లు టీడీపీ అనుకూల సైడ్‌ను తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రెండు మూడు రోజుల కిందట ఓ సినిమాలు లేని హీరోతో డిబేట్…. ప్యాకేజీలో భాగ‌మ‌నే ప్ర‌చారం మీడియా స‌ర్కిళ్ల‌లో జ‌రుగుతోంది. ఎన్నిక‌లు అయిపోయేవ‌ర‌కు ఈ ప్ర‌చార ఉధృతి ఇలానే న‌డుస్తుంద‌ని అంటున్నారు.

ముఖ్యంగా ప్రైమ్‌టైమ్‌లో డిబేట్ల పేరుతో టీడీపీ అనుకూల ప్ర‌చారం న‌డుస్తోంద‌ని చెబుతున్నారు. ఈ క‌మెడియ‌న్ హీరోనే కాదు… ఒక మాజీ ఎంపీతో పాటు త‌ట‌స్తుల పేరుతో టీడీపీ అనుకూల ప్ర‌చారం చేయ‌డం ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశ‌మ‌ని తెలుస్తోంది.

ఇక రేటింగ్‌లో రెండు మూడు స్థానాల మ‌ధ్య పోటీ ప‌డే మ‌రో చాన‌ల్ కూడా టీడీపీ అనుకూల ప్ర‌చారానికి ప్రాధాన్య‌త ఇస్తోంది. అయితే పైకి క‌నిపించ‌కుండా బ్రేకింగ్ స్టోరీల‌తో ఈ చానల్ లాక్కోస్తోంది. ఈ చాన‌ల్‌కు కూడా ప్యాకేజీ అందిన‌ట్లు అమ‌రావ‌తి నుంచి వినిపిస్తున్న మాట‌.

మ‌రోవైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా తిరుప‌తిలో జ‌రిగిన స‌భ‌లో ప‌చ్చ మీడియాలో మ‌రో చాన‌ల్‌ను చేర్చారు. ఈ చాన‌ల్ డిబేట్ల పేరుతో జ‌నం అభిప్రాయాన్ని మార్చాల‌ని చూస్తున్నార‌ని… జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ ఈ ప్యాకేజీ మీడియా ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు ప్రసారం చేస్తుందో చూడాలి.

First Published:  6 Feb 2019 8:47 PM GMT
Next Story