Telugu Global
NEWS

పరిహారం కాదు.... అత్యాచారం చేసినోడికి శిక్ష పడాలి....

ఏపీ హైకోర్టు ఏర్పాటు కూడా రాజ్యాంగ విరుద్ధంగానే జరిగిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్. హైకోర్టు ఏర్పాటుకు పార్లమెంట్‌ అంగీకరించాల్సి ఉంటుందని… కానీ నేరుగా రాష్ట్రపతి ఉత్తర్వులతో చేసేశారని విమర్శించారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్‌ కూడా చెప్పారన్నారు. ఇలా పదేపదే రాజ్యాంగాన్ని పక్కనపెట్టి పాలన చేసే పక్షంలో ఇక రాజ్యాంగానికి విలువ ఏముందని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ప్రత్యక్ష ప్రసారాలు మొదలైనప్పటి నుంచి ఒక్క రాష్ట్ర విభజన రోజు మాత్రమే ప్రసారాలు […]

పరిహారం కాదు.... అత్యాచారం చేసినోడికి శిక్ష పడాలి....
X

ఏపీ హైకోర్టు ఏర్పాటు కూడా రాజ్యాంగ విరుద్ధంగానే జరిగిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్. హైకోర్టు ఏర్పాటుకు పార్లమెంట్‌ అంగీకరించాల్సి ఉంటుందని… కానీ నేరుగా రాష్ట్రపతి ఉత్తర్వులతో చేసేశారని విమర్శించారు.

ఈ విషయాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్‌ కూడా చెప్పారన్నారు. ఇలా పదేపదే రాజ్యాంగాన్ని పక్కనపెట్టి పాలన చేసే పక్షంలో ఇక రాజ్యాంగానికి విలువ ఏముందని ప్రశ్నించారు.

పార్లమెంట్‌ ప్రత్యక్ష ప్రసారాలు మొదలైనప్పటి నుంచి ఒక్క రాష్ట్ర విభజన రోజు మాత్రమే ప్రసారాలు ఆపేశారని ఉండవల్లి చెప్పారు. లైవ్ ప్రసారాలు ఆపేసి, డివిజన్‌ కూడా లేకుండానే రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు.

అత్యాచారం చేశారు కాబట్టి నష్టపరిహారం ఇవ్వండి అని అడగడం మానేసి… అత్యాచారం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టేలా ఏపీకి సంబంధించిన పార్టీలు పోరాటం చేయాలన్నారు. రెండు రాష్ట్రాలను తిరిగి కలపడం అయ్యే పనికాదని… ఆ అవసరం కూడా లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ వాళ్లు సర్వనాశనం చేశారని స్వయంగా లోక్‌సభలో ప్రధాని మోడీనే చెప్పారని… ఆ అన్యాయం ఏంటి అన్న దానిపై చర్చకు డిమాండ్ చేసే ధైర్యం కూడా మన ఎంపీలకు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

First Published:  2 Feb 2019 1:18 AM GMT
Next Story