Telugu Global
NEWS

ఏపీలో ఎల్లో ఖైదీలకు మాత్రమే క్షమాభిక్ష....

ఏపీలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయడంలోనూ పక్షపాతం వెలుగుచూసింది. టీడీపీ నేతల సిఫార్సులు ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం సత్ప్రవర్తన కింద వదిలేస్తోంది. విడుదలకు మొత్తం 161 మంది ఖైదీలు అర్హత సాధించారు. కానీ వీరిలో కేవలం 33 మంది ఖైదీల విడుదలకు మాత్రమే కేబినెట్ ఆమోదం తెలిపింది. వీరంతా టీడీపీ సానుభూతిపరులు, టీడీపీ నేతల సిఫార్సులు ఉన్నవారే. మిగిలిన 128 మంది ఖైదీలు విడుదలయ్యేందుకు అర్హత ఉన్నా ప్రభుత్వం మాత్రం వారిని వదిలిపెట్టేందుకు […]

ఏపీలో ఎల్లో ఖైదీలకు మాత్రమే క్షమాభిక్ష....
X

ఏపీలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయడంలోనూ పక్షపాతం వెలుగుచూసింది. టీడీపీ నేతల సిఫార్సులు ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం సత్ప్రవర్తన కింద వదిలేస్తోంది.

విడుదలకు మొత్తం 161 మంది ఖైదీలు అర్హత సాధించారు. కానీ వీరిలో కేవలం 33 మంది ఖైదీల విడుదలకు మాత్రమే కేబినెట్ ఆమోదం తెలిపింది. వీరంతా టీడీపీ సానుభూతిపరులు, టీడీపీ నేతల సిఫార్సులు ఉన్నవారే.

మిగిలిన 128 మంది ఖైదీలు విడుదలయ్యేందుకు అర్హత ఉన్నా ప్రభుత్వం మాత్రం వారిని వదిలిపెట్టేందుకు అంగీకరించలేదు. మంత్రి ఆదినారాయణరెడ్డి సిఫార్సుతో అనంతపురం జిల్లా జైలు నుంచి ఆరుగురు ఖైదీలను విడుదల చేస్తున్నారు.

ప్రభుత్వం చూపుతున్న పచ్చపాతంపై మిగిలిన 128 మంది ఖైదీల కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఖైదీల విడుదలలో కూడా ఈ రాజకీయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కోర్టుకు వెళ్లి విడుదలకు అర్హత ఉన్నట్టు నిర్ధారించుకుని వచ్చిన ఖైదీలను కూడా విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ అంగీకరించలేదు.

First Published:  2 Feb 2019 6:34 AM GMT
Next Story