Telugu Global
Cinema & Entertainment

పరిణీతి, అలియా.... ఎవరికి ఓటు?

ఆర్-ఆర్-ఆర్…. సెకెండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. యూనిట్ సైలెంట్ గా తమపని తాము చేసుకుపోతోంది. రెండో షెడ్యూల్ లో హీరోయిన్స్ పై క్లారిటీ ఇస్తారనుకుంటే అది జరగలేదు. దీంతో ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్లపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. ఇందులో భాగంగా పరిణీతి, అలియా మధ్య ఎక్కువగా చర్చ సాగుతోంది. ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక హీరోయిన్ గా కీర్తిసురేష్ ను ఫిక్స్ చేశారనేది అనధికారికంగా నిర్థారించిన వార్త. ఇక మరో హీరోయిన్ ను […]

పరిణీతి, అలియా.... ఎవరికి ఓటు?
X

ఆర్-ఆర్-ఆర్…. సెకెండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. యూనిట్ సైలెంట్ గా తమపని తాము చేసుకుపోతోంది. రెండో షెడ్యూల్ లో హీరోయిన్స్ పై క్లారిటీ ఇస్తారనుకుంటే అది జరగలేదు. దీంతో ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్లపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. ఇందులో భాగంగా పరిణీతి, అలియా మధ్య ఎక్కువగా చర్చ సాగుతోంది.

ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక హీరోయిన్ గా కీర్తిసురేష్ ను ఫిక్స్ చేశారనేది అనధికారికంగా నిర్థారించిన వార్త. ఇక మరో హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి తీసుకొద్దామనే ఉద్దేశంతో వెదుకులాట స్టార్ట్ చేసి, ఫైనల్ గా పరిణీతి చోప్రా, అలియాభట్ దగ్గరకొచ్చి ఆగినట్టు తెలుస్తోంది.

వీళ్లిద్దర్లో ఎవర్ని ఫైనల్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం దర్శకుడు జక్కన్నదే. కాకపోతే ప్రస్తుతం రాజమౌళి, సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన సన్నివేశాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తర్వాతే హీరోయిన్లపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటివరకు ఇది ట్రెండింగ్ టాపిక్కే.

First Published:  30 Jan 2019 11:03 PM GMT
Next Story