Telugu Global
Cinema & Entertainment

శ్రీను వైట్ల తో అఖిల్ ?

అఖిల్… అక్కినేని కుటుంబం నుండి మూడో తరంలో ఆఖరిగా అరంగేట్రం చేసిన హీరో. మొదటి మూడు చిత్రాలు ఆశించిన విజయం సాదించకపోవడం తో నాలుగో సినిమాతోనైనా హిట్టుకొట్టాలన్న ఆలోచన తో ప్రస్తుతం ముందుకెళ్తున్నాడట. వి.వి వినాయక్ తో “అఖిల్”, విక్రం కుమార్ తో “హలో” చిత్రాల తర్వాత అనేక అంచనాల మధ్య వెంకీ అట్లూరి తో తీసిన సినిమా “మిస్టర్ మజ్ను” ఇటీవలే విడుదల అయింది. కానీ ఆశించిన స్థాయి లో జనాలను ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యం […]

శ్రీను వైట్ల తో అఖిల్ ?
X

అఖిల్… అక్కినేని కుటుంబం నుండి మూడో తరంలో ఆఖరిగా అరంగేట్రం చేసిన హీరో. మొదటి మూడు చిత్రాలు ఆశించిన విజయం సాదించకపోవడం తో నాలుగో సినిమాతోనైనా హిట్టుకొట్టాలన్న ఆలోచన తో ప్రస్తుతం ముందుకెళ్తున్నాడట.

వి.వి వినాయక్ తో “అఖిల్”, విక్రం కుమార్ తో “హలో” చిత్రాల తర్వాత అనేక అంచనాల మధ్య వెంకీ అట్లూరి తో తీసిన సినిమా “మిస్టర్ మజ్ను” ఇటీవలే విడుదల అయింది. కానీ ఆశించిన స్థాయి లో జనాలను ఆకట్టుకోలేదు.

ఈ నేపథ్యం లో అక్కినేని అభిమానులు అఖిల్ నాలుగో చిత్రం ఉంటుందా? అన్న ఆలోచనలో ఉండగా…. అఖిల్ మాత్రం శ్రీను వైట్ల ని నమ్ముకున్నాడన్న వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే శ్రీను వైట్ల అఖిల్ కోసం స్పోర్ట్స్ నేపథ్యం లో ఒక కథను రాసుకున్నాడట. దాన్ని ఇంతకు మునుపే నాగార్జున కి కూడా చెప్పాడట. యాక్షన్, రోమాన్స్, లవ్ స్టోరీలు సక్సెస్ ఇవ్వకపోవడంతో…. ఇప్పుడు అఖిల్ స్పోర్ట్స్ కథతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరో పక్క రవిరాజ పినిశెట్టి కుమారుడు సత్య ప్రభాస్ కూడా అఖిల్ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు చెబతున్నారు.

అయితే నాగార్జున మాత్రం మిస్టర్ మజ్ను రిజల్ట్ తరువాత…. అఖిల్ ను కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండమని సూచించాడన్న వార్తలు కూడా వచ్చాయి.

First Published:  30 Jan 2019 1:57 AM GMT
Next Story