Telugu Global
National

కేటీఆర్ సర్.... నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది? ఉపాసన

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన కామినేని….తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్వీట్ చేశారు. నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్ సర్? అంటూ ట్వీట్ చేశారామే. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమావేశం కోసం దావోస్ వెళ్లాను… తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనకునే వారికి సమాచారం అందించేందుకు…. ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్ లో నేను కూర్చున్నానని ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గురించి….తెలంగాణ గురించి కూడా ఉపాసన ప్రస్తావించారు. 1 of […]

కేటీఆర్ సర్.... నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది? ఉపాసన
X

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన కామినేని….తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్వీట్ చేశారు. నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్ సర్? అంటూ ట్వీట్ చేశారామే.

వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమావేశం కోసం దావోస్ వెళ్లాను… తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనకునే వారికి సమాచారం అందించేందుకు…. ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్ లో నేను కూర్చున్నానని ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గురించి….తెలంగాణ గురించి కూడా ఉపాసన ప్రస్తావించారు.

ప్రపంచంలో నివసించడానికి ఉన్న అత్యుత్తమ స్థలాల్లో తెలంగాణ మూడవదని….స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా , ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో హైదరాబాద్, తెలంగాణ ముందున్నాయని ఉపాసన పేర్కొన్నారు.

అంతేకాదు హైదరాబాద్ గురించి ఉపాసన గొప్పగా ట్వీట్ చేశారు. తెలంగాణలో పెట్టుబడుటు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు….సమాచారం అందించడంలో తనవంతు సాయం చేసేందుకు ఫోరంలో తెలంగాణ డెస్క్ కు కో ఆర్డినేటర్ గా ఉపాసన వ్యవహారించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్వీటర్ ద్వారా వెల్లడించారు.

First Published:  24 Jan 2019 8:29 PM GMT
Next Story