Telugu Global
National

ట్విట్టర్‌లో కేటీఆర్‌, ఓమర్‌ సరదా సంభాషణ

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఒక ఇల్లు బాగా నచ్చేసింది. ఆ ఇల్లు కశ్మీర్ మాజీ సీఎం ఓమర్‌ అబ్దుల్లాది. మంచుతో కప్పేసిన తన ఇంటిని ఓమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన కేటీఆర్… ఒకవేళ కోరికలు నెరవేర్చే ఫ్యాక్టరీ ఉంటే… ఈ క్షణమే అక్కడ ఉండేవాడిని అని ట్వీట్ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌కు ఓమర్ స్పందించారు. కేటీఆర్‌ను తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ”నా ఇంటిని మీ ఇల్లే అనుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే […]

ట్విట్టర్‌లో కేటీఆర్‌, ఓమర్‌ సరదా సంభాషణ
X

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఒక ఇల్లు బాగా నచ్చేసింది. ఆ ఇల్లు కశ్మీర్ మాజీ సీఎం ఓమర్‌ అబ్దుల్లాది. మంచుతో కప్పేసిన తన ఇంటిని ఓమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

ఇందుకు స్పందించిన కేటీఆర్… ఒకవేళ కోరికలు నెరవేర్చే ఫ్యాక్టరీ ఉంటే… ఈ క్షణమే అక్కడ ఉండేవాడిని అని ట్వీట్ చేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌కు ఓమర్ స్పందించారు. కేటీఆర్‌ను తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ”నా ఇంటిని మీ ఇల్లే అనుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ ఉండవచ్చు ” అని ఆఫర్ చేశారు.

ఇందుకు స్పందించిన కేటీఆర్‌… ”ఓమర్ సాబ్ మీ ఆఫర్‌ను నేను సీరియస్‌గా తీసుకుంటాను. సరేనా” అని సరదాగా ట్వీట్ చేశారు.

First Published:  17 Jan 2019 1:55 AM GMT
Next Story