Telugu Global
NEWS

ప్రాజెక్ట్‌కు పరిటాల రవి పేరు

మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవి పేరును సాగునీటి ప్రాజెక్టుకు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్న ఎగువ పెన్నార్ ఎత్తిపోతల పథకానికి పరిటాల రవి పేరు పెడుతూ ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎగువ పెన్నార్ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసేందుకు ఒక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టెండర్లు పిలిచి నిర్మాణ […]

ప్రాజెక్ట్‌కు పరిటాల రవి పేరు
X

మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవి పేరును సాగునీటి ప్రాజెక్టుకు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్న ఎగువ పెన్నార్ ఎత్తిపోతల పథకానికి పరిటాల రవి పేరు పెడుతూ ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎగువ పెన్నార్ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసేందుకు ఒక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టెండర్లు పిలిచి నిర్మాణ పనులకు పూనుకుంది. ఈ ప్రాజెక్టుకే పరిటాల రవి పేరు పెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి పరిటాల సునీత విజ్ఞప్తి చేయడం, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కూడా ప్రతిపాదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జలవనరుల శాఖ తన ఉత్తర్వుల్లో వివరించింది.

జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా… అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. పరిటాల సునీత ఆయనకు విజ్ఞప్తి కూడా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత పరిటాల రవి పేరును ఎగువ పెన్నార్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పెట్టింది. జీడిపల్లి నుంచి ఎగువ పెన్నార్ కు నీటిని ఎత్తిపోసే ఈ పథకాన్ని 803 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టారు.

First Published:  4 Jan 2019 9:55 PM GMT
Next Story