Telugu Global
NEWS

టీఆర్ఎస్ గెలుపుకు మూడు కారణాలు చెప్పిన కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువడానికి మూడు కారణాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.  కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తన నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ గెలుపునకు ప్రధానంగా మూడు విషయాలు దోహదం చేశాయని వివరించారు. మొదటిది కేసీఆర్ నాయత్వం. రెండోది ప్రజల ఆశీర్వాదం కాగా మూడోది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కృషి అని వివరించారు. […]

టీఆర్ఎస్ గెలుపుకు మూడు కారణాలు చెప్పిన కేటీఆర్
X

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువడానికి మూడు కారణాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.

కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తన నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ గెలుపునకు ప్రధానంగా మూడు విషయాలు దోహదం చేశాయని వివరించారు.

మొదటిది కేసీఆర్ నాయత్వం. రెండోది ప్రజల ఆశీర్వాదం కాగా మూడోది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కృషి అని వివరించారు. ఇది అద్భుతమైన విజయమని కొనియాడారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలువలేదని…. తెలంగాణ ప్రజానీకం గెలించిందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక హామీ ఇస్తున్నానని కేసీఆర్ తెలిపారు. ఇక్కడ ఉన్న ఆంధ్రా, కర్ణాటక, పంజాబ్, బెంగూళూరు, దేశంలోని ఏ రాష్ట్రం నుంచి వచ్చి స్థిరపడిన వారంతా తమ సోదరులేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరి కోసం పని చేస్తుందని, ఎవరిపై కక్ష సాధింపు ఉండదని స్పష్టం చేశారు. అందరిపట్ల ఒకే ధోరణితో త్రికరణ శుద్ధిగా పని చేస్తుందని చెప్పారు. కూకట్ పల్లికి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత కూడా తనదేనని ఆయన స్పష్టం చేశారు.

మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుపుతో తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇక త్వరలో జరుగబోయే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని, ఆ తర్వాత జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా విజయ దుందుభి మోగించబోతున్నామని అన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ఢిల్లీని శాసించే అవకాశం వస్తుందని చెప్పారు. ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు.

ఇప్పటి నుంచి కిందటి ఎన్నికల్లో పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఆ వర్గాలను తమ పని తీరుతో మెప్పించి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ తెలిపారు. తమకు సహకరించిన ప్రతిఒక్కరికి ఈ విజయంలో వాటా దక్కుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

First Published:  30 Dec 2018 4:01 AM GMT
Next Story