Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ ఇప్పుడు ఛాన్స్ ఇస్తాడా ?

“అందాల రాక్షసి” లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించిన డైరెక్టర్ గా హను రాఘవపూడి కి మంచి పేరుంది. కానీ ఇటీవలే హను నుంచి వచ్చిన కొత్త ప్రేమ కథ అయిన “పడి పడి లేచే మనసు” మాత్రం ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ అయిన కూడా హ‌నుపై న‌మ్మ‌కాలు మాత్రం త‌గ్గ‌ట్లేదు నిర్మాతలకి. ఎందుకంటే మైత్రీ మూవీ మేకర్స్  వారు  హ‌నుకి అడ్వాన్స్ ఇచ్చారట.  ఇప్పుడు అల్లు అర్జున్ హానుతో ఓ […]

అల్లు అర్జున్ ఇప్పుడు ఛాన్స్ ఇస్తాడా ?
X

“అందాల రాక్షసి” లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించిన డైరెక్టర్ గా హను రాఘవపూడి కి మంచి పేరుంది. కానీ ఇటీవలే హను నుంచి వచ్చిన కొత్త ప్రేమ కథ అయిన “పడి పడి లేచే మనసు” మాత్రం ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ అయిన కూడా హ‌నుపై న‌మ్మ‌కాలు మాత్రం త‌గ్గ‌ట్లేదు నిర్మాతలకి. ఎందుకంటే మైత్రీ మూవీ మేకర్స్ వారు హ‌నుకి అడ్వాన్స్ ఇచ్చారట. ఇప్పుడు అల్లు అర్జున్ హానుతో ఓ సినిమా చేయ‌డానికి ఫిక్స‌య్యాడ‌ని స‌మాచారం.

'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యాడు. ఆ త‌ర‌వాత‌ హ‌నుని త‌న ఆఫీసుకు పిలిపించుకుని క‌థ విష‌య‌మై మాట్లాడాడ‌ట‌. 'ఓ మంచి క‌థ చెప్పు.. కలిసి ప‌నిచేద్దాం' అని ఆఫర్ ఇచ్చాడ‌ట‌. హ‌ను మైత్రీలో చేయ‌బోయే సినిమాకి బ‌న్నీనే హీరో అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మరి ప్లాప్ ని అందుకున్న హను కి ఇలాంటి టైం లో అల్లు అర్జున్ అవకాశం ఇస్తాడా అనేది క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ఎందుకంటే మైత్రీ కూడా అల్లు అర్జున్‌కి ఇది వ‌ర‌కే అడ్వాన్స్ ఇచ్చింది. అడ్వాన్స్ అయితే ఇచ్చారు కానీ హను ని మాత్రం డైరెక్టర్ గా సజెస్ట్ చెయ్యలేదు. దీన్ని బట్టి చూస్తుంటే చేతి వరకు వచ్చిన ఆఫర్ ని హను చేజార్చుకున్నాడు అని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

First Published:  26 Dec 2018 9:40 PM GMT
Next Story