Telugu Global
Cinema & Entertainment

రానా సినిమాకి క్రేజీ టైటిల్

దగ్గుబాటి రానా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. కానీ వచ్చే ఏడాది మాత్రం రానా వరుస సినిమాలతో బిజీగా ఉండబోతున్నాడు. ఇప్పటికే “హాథి మేరే సాతి” సినిమా లో నటిస్తున్న రానా త్వరలో “1945” సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నాడు. రెజినా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే 2019 లొనే గుణశేఖర్ దర్శకత్వంలో “హిరణ్య కశ్యప” అనే సినిమాలో నటిస్తాడు రానా. అయితే రానా, సాయి పల్లవి […]

రానా సినిమాకి క్రేజీ టైటిల్
X

దగ్గుబాటి రానా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. కానీ వచ్చే ఏడాది మాత్రం రానా వరుస సినిమాలతో బిజీగా ఉండబోతున్నాడు. ఇప్పటికే “హాథి మేరే సాతి” సినిమా లో నటిస్తున్న రానా త్వరలో “1945” సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నాడు. రెజినా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే 2019 లొనే గుణశేఖర్ దర్శకత్వంలో “హిరణ్య కశ్యప” అనే సినిమాలో నటిస్తాడు రానా.

అయితే రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కూడా వచ్చే ఏడాదే సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమాకి “విరాట పర్వం” అనే టైటిల్ ని అనుకున్నారు మూవీ యూనిట్. సినిమా మొత్తం రాజకీయ కృతంత్రాలతో ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి ఆ టైటిల్ అయితే బాగుంటుంది అని దర్శకుడు వేణు ఉడుగుల భావిస్తున్నాడు. సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్న ఈ సినిమాలో రానా కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు.

“నీదీ నాదీ ఓకే కథ” వంటి సినిమా తో ఆకట్టుకున్న వేణు డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో రానా పాత్ర కంటే కూడా సాయి పల్లవి పాత్ర కీలకమట. ఈ సినిమా పై అధికారిక ప్రకటన జనవరి మొదటి వారంలో రానుంది.

First Published:  26 Dec 2018 10:47 PM GMT
Next Story