Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కి కార్లంటే పిచ్చట!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “సాహో” సినిమాతో బిజీగా ఉన్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 15 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు “జిల్” ఫేం రాధ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పూర్తి స్థాయి రొమాంటిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే […]

ప్రభాస్ కి కార్లంటే పిచ్చట!
X

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “సాహో” సినిమాతో బిజీగా ఉన్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 15 న రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమాతో పాటు “జిల్” ఫేం రాధ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పూర్తి స్థాయి రొమాంటిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ సినిమా 1960 నాటి కాలంలో సాగుతుందని, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ కార్లను కొనే ధనవంతుడిగా కనిపించబోతున్నాడని రాధా కృష్ణ వెల్లడించాడు. కార్ల కోసం ఎంతైనా ఖర్చు పెట్టె పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడట.

సినిమాలో వింటేజ్ కార్లకు, ప్రభాస్ కు చాలా దగ్గర సంబంధాలుంటాయని రాధాకృష్ణ తెలిపారు. యువి క్రియేషన్స్ పై వంశీ- ప్రమోద్, గోపి కృష్ణ మూవీస్ పై కృష్ణం రాజు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

First Published:  23 Dec 2018 3:00 AM GMT
Next Story