Telugu Global
National

గూగుల్ లో హాట్ టాపిక్ గా.... తాప్సి ట్వీట్!

ప్రముఖ నటి తాప్సి ట్వీట్… ఇప్పుడు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో హాట్ టాపిక్ గా మారింది. తాప్సి శరీర భాగాల గురించి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ” తాప్సి…మీ శరీర భాగాలంటే నాకు చాలా ఇష్టం” అని అసభ్యంగా మాట్లాడాడు. దీంతో అదిరిపోయే సమాధానం ఇచ్చింది తాప్సి. వావ్ … నాక్కూడా ఇష్టం. మరి నీకు ఏ శరీర భాగమంటే ఇష్టం. నాకైతే నా సెరీబ్రమ్ అంటే ఇష్టం. అని ఒక్క సమాధానంతో […]

గూగుల్ లో హాట్ టాపిక్ గా.... తాప్సి ట్వీట్!
X

ప్రముఖ నటి తాప్సి ట్వీట్… ఇప్పుడు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో హాట్ టాపిక్ గా మారింది. తాప్సి శరీర భాగాల గురించి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

” తాప్సి…మీ శరీర భాగాలంటే నాకు చాలా ఇష్టం” అని అసభ్యంగా మాట్లాడాడు. దీంతో అదిరిపోయే సమాధానం ఇచ్చింది తాప్సి. వావ్ … నాక్కూడా ఇష్టం. మరి నీకు ఏ శరీర భాగమంటే ఇష్టం. నాకైతే నా సెరీబ్రమ్ అంటే ఇష్టం. అని ఒక్క సమాధానంతో సదరు నెటిజన్ నోరుమూయించింది తాప్సి. దీంతో ఈ ట్వీట్ కాస్తా రెండు రోజులుగా వైరల్ అవుతోంది.

సెరీబ్రమ్ అంటే ఏంటో తెలుసుకునేందుకు….అందరూ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారట. రాహుల్ అనే నెటిజన్ ఈ విషయాన్ని తాప్సీకి వివరించారు. మీరు గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ను పడగొట్టేశారు. సెరీబ్రమ్ గురించే తెగ వెతికేస్తున్నారు. మిమ్మల్ని అసభ్యంగా ప్రశ్నించిన నెటిజన్ కూడా ఈ పదం తెలుసుకోవడంలో బిజీగా ఉండుంటాడు అని ట్వీట్ చేశాడు. ఇందుకు తాప్సి చిరునవ్వుతో ఉన్న ఎమోజీలతో స్పందించారు. ఇంతకు సెరీబ్రమ్ అంటే ఏంటో తెలుసా ? (పెద్ద మెదడు)

గతంలోనూ ఇలాంటి అసభ్యకర ప్రశ్నలు ఎదురైనప్పుడు దీటైన సమాధానం ఇచ్చింది తాప్సి.

First Published:  19 Dec 2018 11:38 PM GMT
Next Story