Telugu Global
NEWS

తనకన్నా ముందు వెళ్లాడని కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన వ్యక్తి చంద్రబాబు

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ … ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. విశాఖలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్‌ సభలో మాట్లాడిన ఆయన… ప్రస్తుతం రాజకీయం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోందన్నారు. ఎన్నికలు వేలం పాటలా మారిపోయాయన్నారు. అవతలి వాడు రెండు వేలు ఇస్తే… మనం కనీసం 200 అయినా ఇవ్వాల్సిందే అన్న పరిస్థితి వచ్చేసిందన్నారు. అస్సలు డబ్బులు ఇవ్వకపోతే ఆ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమన్న భావన వచ్చిందన్నారు. 20 కోట్లు పెట్టి […]

తనకన్నా ముందు వెళ్లాడని కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన వ్యక్తి చంద్రబాబు
X

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ … ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. విశాఖలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్‌ సభలో మాట్లాడిన ఆయన… ప్రస్తుతం రాజకీయం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోందన్నారు. ఎన్నికలు వేలం పాటలా మారిపోయాయన్నారు.

అవతలి వాడు రెండు వేలు ఇస్తే… మనం కనీసం 200 అయినా ఇవ్వాల్సిందే అన్న పరిస్థితి వచ్చేసిందన్నారు. అస్సలు డబ్బులు ఇవ్వకపోతే ఆ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమన్న భావన వచ్చిందన్నారు. 20 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరిగి ఆ సొమ్ము సంపాదించుకునేందుకే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం అన్నది పెట్టుబడిగా మారిపోయిందన్నారు.

అవినీతిలో కూరుకుపోయి కూడా తిరిగి నీతులు మాట్లాడే నేతలు ఈ మధ్య తయారయ్యారన్నారు. ఒకవేళ నిజంగా రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయి ఉంటే తిరిగి కొడుకును కూడా ఎందుకు తీసుకొస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. మన ఇంటి పక్కనే ఉన్న భూమిని ఎమ్మెల్యే, మంత్రి కబ్జా చేసినా చూస్తూ ఊరుకుంటాం గానీ… పార్లమెంట్‌లో ఎంపీలకు సబ్సిడీ మీద భోజనం పెడితే మాత్రం ప్రశ్నిస్తుంటామని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అన్నది మన కృషిని బట్టి కాకుండా… మన తలరాతను బట్టి ఆధారపడి ఉందని నిర్వేదం వ్యక్తం చేశారు. 20 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే సొంత సంపాదనను చూసుకోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. పబ్లిసిటీ పిచ్చి కూడా నేతల్లో పెరిగిపోయిందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ఉండవల్లి రెండు అంశాలను ప్రస్తావించారు.

హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు విశాఖలో గెస్ట్‌ హౌజ్ సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడికి రావడానికి చంద్రబాబు నిరాకరించారన్నారు. బస్సులోనే పడుకుంటే పబ్లిసిటీ వస్తుందని బస్సులోనే ఉండిపోయారన్నారు. ఈ విషయాన్ని మాజీ సీఎస్ ఐవైఆర్ తన పుస్తకంలోనే వివరించారన్నారు.

1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన మరో సంఘటన గురించి కూడా ఉండవల్లి వివరించారు. 1996లో గోదావరి జిల్లాలో వరద రాగా అప్పటి కలెక్టర్ రెడ్డి సుబ్రమణ్యం వెంటనే జీపులో వెళ్లి వరద ప్రాంతంలో ప్రజలను స్వయంగా నీళ్లలోకి దిగి రక్షించారన్నారు.

ఆ ఫొటోలు మరుసటి రోజు పత్రికల్లో కూడా వచ్చాయన్నారు. దాని చూసిన చంద్రబాబు తన కంటే ముందే సంఘటనా స్థలికి ఎందుకు వెళ్లారని కలెక్టర్‌పై మండిపడ్డారని.. అంతటితో ఆగకుండా కలెక్టర్‌ను సస్పెండ్ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. చంద్రబాబు ప్రచార యావ ఆస్థాయిలో ఉందన్నారు.

First Published:  9 Dec 2018 5:18 AM GMT
Next Story